RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, జులై 2022, బుధవారం

నీ రూపు మారింది గోపాలుడా | Nee rupu marindi Gopaluda | song Lyrics | Alaya Sikharam (1983)

నీ రూపు మారింది గోపాలుడా



చిత్రం: ఆలయశిఖరం (1983) 

సంగీతం: సత్యం 

గీతరచయిత: సినారె 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


నీ రూపు మారింది గోపాలుడా..

లేని నాజూకు పెరిగింది నా రాముడా.. 

పూలఉయ్యాల ఊపాలా..

ఓ బాలుడా..బాలుడా..గోపాలుడా.. 

హా..ఆ బాలుడా..గోపాలుడా.. 


హ్హా..హ్హా..హ్హా.. 

ఈ రాధ కన్నేస్తే గోపాలుడే..

మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే.. 

వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే.. 

బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే.. 


చరణం 1: 


మెరిసే నీ కళ్ళలోనా..

గండు మీనై నేనీది రానా..ఆ..ఆ 

వలపే నీ గుండెలోనా..

మురళి పిలుపై నే ఊగిపోనా.. 



మెరిసే నీ కళ్ళలోనా..

గండు మీన నేనీది రానా..ఆ..ఆ 

ఓ..ఓ..వలపే నీ గుండె లోనా..

మురళి పిలుపై నే ఊగిపోనా.. 


నీ కమ్మని పెదవి పిల్లనగ్రోవి కావాలంటనా.. 

అది ఊదుతుంటే ఒళ్ళే మరచి ఊగుతుంటాను 


ఆహ.. నీ రూపు మారింది గోపాలుడా..

లేని నాజూకు పెరిగింది నా రాముడా.. 

వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే.. 

బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే.. 


చరణం 2: 


ఎదురుగ నీవుండిపోతే..

జీవనదిలా ఉప్పొంగిపోనా.. 

నదిలా ఉప్పొంగిపోతే..

నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ 

ఎదురుగ నీవుండిపోతే..

జీవనదిలా ఉప్పొంగిపోనా.. 

ఆ..ఆ..నదిలా ఉప్పొంగిపోతే..

నిన్ను ఎదలో నేదాచుకోనా..ఆ 


హద్దులు దాటి..మబ్బులు మీటి..

ఆడుకుందామా... 

ముద్దులతోనే..మిద్దెలు కట్టి 

ముచ్చటగుందామా... 


ఆహ..నీ రూపు మారింది గోపాలుడా..

లేని నాజూకు పెరిగింది నా రాముడా.. 

పూలఉయ్యాల ఊపాలా..ఓ బాలుడా..

బాలుడా..గోపాలుడా.. 

హా..ఆ బాలుడా..గోపాలుడా.. 


హ్హా..హ్హా..హ్హా.. 

ఈ రాధ కన్నేస్తే గోపాలుడే..

మరి ఈ సీత కరుణిస్తే శ్రీరాముడే.. 

వీడు..ఈనాడు..ఏనాడు..నీ బాలుడే.. 

బాలుడే..గోపాలుడే..బాలుడే..గోపాలుడే..


పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు