ఆకుమీద ఆకుపెట్టి
చిత్రం : ఇద్దరూ ఇద్దరే (1976 )
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాశరధి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఆకు మీద ఆకు పెట్టి.. ఆకులోన సున్నమెట్టి
ఆకు మీద ఆకు పెట్టి.. ఆకులోన సున్నమెట్టి
చిలక చుట్టి తెచ్చానయ్యో చిన్నయ్యో..ఓ..ఓ..
ఒడుపు తెలిసి కొరకాలయ్యో..రాజయ్యో
ఒడుపు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో..హా..
మావిడంచు చీరగట్టి.. మల్లెపూల చెండు పెట్టి
మావిడంచు చీరగట్టి.. మల్లెపూల చెండు పెట్టి
చిలక చుట్టి నోటికిస్తే చిన్నమ్మో..ఓ..
నీ బుగ్గ మీద గంటుపడనే సీతమ్మో...హా..
బుగ్గ మీద గంటుపడనే..సీతమ్మో..హేయ్
ఆకు మీద ఆకుపెట్టి..
ఆకులోన సున్నమెట్టి..హా..ఆ
చరణం 1 :
తీయతీయటి మావిడిపళ్ళు కోరి నేను ఇస్తంటే..హా..
తీయతీయటి మావిడిపళ్ళు కోరి నేను ఇస్తంటే
కొంగులాగి ఏవేవో కోంటి పనులు చేసేవా? ..
ఏవయ్యో.. రాజయ్యో
ఏవయ్యో రాజయ్యో.. ఇది నీకు తగదయ్యో...
తీయతీయటి పండువు నువ్వే
తేనెను మించిన తీపివి నువ్వే..ఆ..హా..ఆ..హా..
హోయ్..తీయతీయటి పండువు నువ్వే
తేనెను మించిన తీపివి నువ్వే
కొంగు దాచిన పరువాలన్ని
దొంగిలించుకుపోతానే..
ఏవమ్మో..సీతమ్మో
ఏవమ్మో...సీతమ్మో...వదిలేది లేదమ్మో..
ఏ..హే.....సీతమ్మో....
ఆకుమీద ఆకుపెట్టి.. ఆకులోన సున్నమెట్టి
చిలకచుట్టి నోటికిస్తే చిన్నమ్మో..ఓ..
నీ బుగ్గ మీద గంటుపడనే సీతమ్మో...హా..
ఒడుపు తెలిసి కొరకాలయ్యో..రాజయ్యో
చరణం 2 :
ఊసులేవో చెపుతానంటే ఆశతోటి చెంతకు వస్తే..ఆ..హ..
ఊసులేవో చెపుతానంటే ఆశతోటి చెంతకు వస్తే
పొద చాటుకు లాగేసీ పోకిరి పనులు చేసేవా..
ఏవయ్యో...రాజయ్యో...
ఏవయ్యో రాజయ్యో ఇది నీకు తగదయ్యో...
దోరవయసు కవ్విస్తుంటే ఓర చూపు ఊరిస్తుంటే..
అహా..హా..
దోరవయసు కవ్విస్తుంటే
ఓర చూపు ఊరిస్తుంటే
ఒళ్ళు మరచి వాటేసుకోనా..
చూడని స్వర్గం చూపించేనా
ఏవమ్మో...సీతమ్మో....
ఏవమ్మో...సీతమ్మో..వదిలేది లేదమ్మో..
హే..హే..హే....సీతమ్మో...
ఆకు మీద ఆకుపెట్టి.. ఆకులోన సున్నమెట్టి
ఆకు మీద ఆకుపెట్టి.. ఆకులోన సున్నమెట్టి
చిలక చుట్టి తెచ్చానయ్యో చిన్నయ్యో..ఓ..ఓ..
ఒడుపు తెలిసి కొరకాలయ్యో..రాజయ్యో
ఒడుపు తెలిసి కొరకాలయ్యో రాజయ్యో..హా..
మావిడంచు చీరగట్టి.. మల్లెపూల చెండు పెట్టి
మావిడంచు చీరగట్టి.. మల్లెపూల చెండు పెట్టి
చిలక చుట్టి నోటికిస్తే చిన్నమ్మో..ఓ..
నీ బుగ్గ మీద గంటుపడనే సీతమ్మో...హా..
బుగ్గ మీద గంటుపడనే..సీతమ్మో..హేయ్
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి