RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

31, జులై 2022, ఆదివారం

సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ | Sannajajuloy Kannemojulo | Song Lyrics | Simhabaladu (1978)

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్



చిత్రం :  సింహబలుడు (1978)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి  



పల్లవి :


సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్

అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే.. 

తళుకు బెళుకు కనవేరా

పాలవెల్లి పుంత కాడ పైట కొంగు జారిపోయె.. 

పడుచు గొడవ వినవేరా


సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్

సన్నజాజులోయ్... కన్నెమోజులోయ్

హా..కన్ను కన్ను గీటుకుంటె సన్న సన్న మంటరేగే.. 

కలికి చిలుక ఇటు రావే

హాయ్ ...హాయ్...

వళ్ళు వళ్ళు మీటుతుంటే వగలమారి సెగలు పుట్టె.. 

వలపు పిలుపు విని పోవే 


చరణం 1 :


'బానిసగా వచ్చావు.. నన్నే నీ బానిసగా చేసుకున్నావు

మగతనం చూపావు.. నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు'


రేయి తెల్లారి తెల్లారి పోతున్నదీ రారా నా దొరా

తీగ అల్లాడి మాల్లాడి పోతున్నదీ రారా సుందరా


ఒకటున్నది నీలో.. ఒడుపున్నది నాలో .. 

అది వున్నది లేనిది తెలుసుకో..హామెరుపున్నది నాలో..

ఉరుమున్నది నీలో..

అది నీదని ఇది నాదని హాయ్..మరిచిపో..  


సన్నజాజులోయ్... కన్నెమోజులో

య్అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే.. 

తళుకు బెళుకు కనవేరా

వళ్ళు వళ్ళు మీటుతుంటే వగలమారి సెగలు పుట్టె.. 

వలపు పిలుపు విని పోవే 


చరణం 2 :



" ఈ ద్వీపానికి దీపానివి నువ్వు .. 

ఈ లంకకే నెలవంకవి నువ్వు "

మల్లె పువ్వంటి రవ్వంటి మనసున్నదిలే .. 

మగతోడుందిలే

చింత చిగురంటి పొగరుంది .. 

వగరుందిలే.. సెగ రేగిందిలే


వలపున్నది నాలో .. బలమున్నది నీలో .. 

ఆ పట్టుని ఈ విడుపుని..  హాయ్..కోరుకో...

సగమున్నది నాలో ... సగమున్నది నీలో .. 

రెంటిని జంటగా మలచుకో ...హాయ్


సన్నజాజులోయ్... కన్నెమోజులో

య్అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే.. 

తళుకు బెళుకు కనవేరా

వళ్ళు వళ్ళు మీటుతుంటే వగలమారి సెగలు పుట్టె.. 

వలపు పిలుపు విని పోవే 

సన్నజాజులోయ్... 

కన్నెమోజులోయ్సన్నజాజులోయ్... 

కన్నెమోజులోయ్


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు