RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ye nimushaniki emi jaruguno లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ye nimushaniki emi jaruguno లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, మార్చి 2025, బుధవారం

ఏ నిమిషానికి ఏమి జరుగునో | Ye Nimushaniki Emijaruguno | Song Lyrics | LavaKusa (1963)

ఏ నిమిషానికి ఏమి జరుగునో



చిత్రం :  లవకుశ (1963)

సంగీతం :  ఘంటసాల

గీతరచయిత :  కొసరాజు 

నేపధ్య గానం :  ఘంటసాల  


పల్లవి :


ఏ నిమిషానికి ఏమి జరుగునో 

ఎవరూహించెదరు

ఏ నిమిషానికి ఏమి జరుగునో 

ఎవరూహించెదరు

విధి విధానమును తప్పించుటకై 

ఎవరు సాహసించెదరు

ఓ...ఏ నిమిషానికి ఏమి జరుగునో 

ఎవరూహించెదరు 


చరణం 1:


కంచె నిజముగ చేను మేసినా 

కాదను వారెవరు

రాజే ఇది శాసనమని పల్కినా 

ప్రతిఘటించు వారెవరు

ఏ నిమిషానికి ఏమి జరుగునో 

ఎవరూహించెదరు


కరుణామయురిది కాదనలేరా 

కఠిన కార్యమనబోరా

సాథ్వులకెపుడు వెతలేనా 

తీరని ధుఃఖపు కథలేనా

ఏ నిమిషానికి ఏమి జరుగునో 

ఎవరూహించెదరు 


చరణం 2 :


ఇనకులమున జనియించిన నృపధులు 

ఈ దారుణము సహించెదరా

వినువీధిని శ్రేణులుగా నిల్చి 

విడ్డూరముగా చూచెదరా

ఏ నిమిషానికి ఏమి జరుగునో 

ఎవరూహించెదరు


ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి 

ఎందుకో ఈ వనవాసాలు

తరచి చూచినా బోధపడవులే 

దైవ చిద్విలాసాలు


ఏ నిమిషానికి ఏమి జరుగునో 

ఎవరూహించెదరు


చరణం 3 :


అగ్నిపరీక్షకే నిల్చిన సాథ్విని 

అనుమానించుట న్యాయమా??

అల్పుని మాటయే జనవాక్యమ్మని 

అల్పుని మాటయే జనవాక్యమ్మని

అనుసరించుటే ధర్మమా??


ఏ నిమిషానికి ఏమి జరుగునో 

ఎవరూహించెదరు

విధి విధానమును తప్పించుటకై 

ఎవరు సాహసించెదరు

ఏ నిమిషానికి ఏమి జరుగునో 

ఎవరూహించెదరు... 

ఎవరూహించెదరు


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు