RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
shivamettina satyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
shivamettina satyam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జనవరి 2025, సోమవారం

గీతా ఓ గీతా డార్లింగ్ మై డార్లింగ్ | Geetha O Geetha | Song Lyrics | Shivamettina Satyam (1979)

గీతా ఓ గీతా డార్లింగ్ మై డార్లింగ్ 



చిత్రం :  శివమెత్తిన సత్యం (1979)

సంగీతం : జె.వి. రాఘవులు

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  ఏసుదాస్, వాణీ జయరాం 


పల్లవి :


గీతా.. ఓ గీతా... డార్లింగ్.... మై డార్లింగ్.....

మనసారా నీతో..ఓ..ఓ..ఓ... మాటాడుకోనీ

మనసారా నీతో..ఓ..ఓ..ఓ... మాటాడుకోనీ


రాజా... ఓ రాజా.. డార్లింగ్.... ఓ మై డార్లింగ్..

మనసారా నీతో.. మాటాడుకోనీ

మనసారా నీతో.. మాటాడుకోనీ 


చరణం 1 :


పరదేశంలో ఆవేశంతో... 

ప్రేమించిన మనకనుమతి.. 

బహుమతీ...


ఈ దేశంలో సంతోషంతో... 

మనువాడినతో... 

అనుబందం... ఆనందం...


వెచ్చనీ... వలపుల ముచ్చటా తీరునూ

అనురాగబంధం ముడివేసుకోనీ..

అనురాగబంధం ముడివేసుకోనీ


రాజా...ఓ..రాజా... డార్లింగ్..ఓ మై డార్లింగ్...

మనసారా నీతో.. మాటాడుకోనీ

మనసారా నీతో.. మాటాడుకోనీ 


చరణం 2 :


చిరునవ్వులతో పులకింతలతో.. 

వికసించిన ఒక మధువనం.. 

యవ్వనం

ఈ భంగిమలో..  

నీ పొంగులతో మురిపించే బిగి కౌగిలీ.. 

జిలిబిలి


ఊహలే రేగితే.. మోహమే ఆగునా... ఆ..ఆ..ఆ

ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ...

ఒడిలోన నన్నూ.. వొదిగొదిగిపోనీ


గీతా.... ఓ.... గీతా...

డార్లింగ్.... మై డార్లింగ్...

ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ...

ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ


- పాటల ధనుస్సు 

నిన్న మొన్నటి చిన్నారివే | Ninna Monnati Chinnarive | Song Lyrics | Shivamettina Satyam (1979)

నిన్న మొన్నటి చిన్నారివే



చిత్రం : శివమెత్తిన సత్యం (1979)

సంగీతం : జె.వి. రాఘవులు

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ  

నేపధ్య గానం :  బాలు 


పల్లవి :


నిన్న మొన్నటి చిన్నారివే

చిన్నారి పలుకుల చెల్లమ్మవే

నిన్న మొన్నటి చిన్నారివే

చిన్నారి పలుకుల చెల్లమ్మవే

నిన్న మొన్నటి చిన్నారివే

ఆ... ఆ... ఆ... ఆ... ఆ

ఈ పెళ్ళిచూపుతో... ఈ చీరకట్టుతో

ఈ పెళ్ళిచూపుతో... చీరకట్టుతో

ఎంత ఎదిగినవే...ఏ...


నిన్న మొన్నటి చిన్నారివే

చిన్నారి పలుకుల చెల్లమ్మవే

నిన్న మొన్నటి చిన్నారివే


చరణం 1 :


పెళ్ళీడు వచ్చింది అమ్మాయికీ... 

పిల్లాణ్ణి చూడరా నీ చెల్లికీ

అని పెద్దోళ్ళు పదిసార్లు అన్నారనీ

ఉబలాట పడ్డాను చూస్తామనీ

ఈ ముస్తాబులో... ఆ నగుమోములో

ఈ ముస్తాబులో... ఆ నగుమోములో

చూసాను చెల్లీ... మన తల్లినీ

నిన్న మొన్నటి చిన్నారివే

చిన్నారి పలుకుల చెల్లమ్మవే

నిన్న మొన్నటి చిన్నారివే


చరణం 2 :


ఒకరికి ఒకరం... ఇక ఎవరికి ఎవరం

ఓపనిదైనా... తప్పని దూరం

ఒకరికి ఒకరం... ఇక ఎవరికి ఎవరం

ఓపనిదైనా... తప్పని దూరం


ఏ ఆడపిల్లా... కానీడుపిల్లా

ఏనాటికైనా... అది ఆడపిల్లా

చేసానమ్మా... ఆ... చేసానమ్మా

నే చేయగలది... ఈ ఇంటి పేరింక

ఆ ఇంట పెరగాలీ..

నిన్న మొన్నటి చిన్నారివే

చిన్నారి పలుకుల చెల్లమ్మవే

నిన్న మొన్నటి చిన్నారివే 


- పాటల ధనుస్సు 

నీవు నా పక్కనుంటే హాయి | Neevu Naa Pakkanunte Hayi | Song Lyrics | Shivamettina Satyam (1979)

నీవు నా పక్కనుంటే హాయి



చిత్రం : శివమెత్తిన సత్యం (1979)

సంగీతం : జె.వి. రాఘవులు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం :  ఏసుదాస్, వాణీ జయరాం


పల్లవి :


నీవు నా పక్కనుంటే హాయి

నీవు లేకుంటే చీకటి రేయి

నీ...కన్నులలోనా

ఎన్నో..ఎన్నో..ఎన్నో.. 

కిరణాలు మెరిశాయి


నీవు నా పక్కనుంటే హాయి

నీవు లేకుంటే చీకటి రేయి

నీ...కన్నులలోనా..

ఎన్నో..ఎన్నో..ఎన్నో..

కిరణాలు మెరిశాయి


నీవు నా పక్కనుంటే హాయీ


చరణం 1 :


కొండలలో కోనలలో ఏకాంతవేళ

గుండెలలో రేగింది సరసాల లీల

కొండలలో కోనలలో ఏకాంతవేళ

గుండెలలో రేగింది సరసాల లీల


అనురాగ శిఖరాన అందాల తోట

అనురాగ శిఖరాన అందాల తోట


ఆ చోట కోనేట సయ్యటలాడాలీ..


నీవు నా పక్కనుంటే హాయి

నీవు లేకుంటే చీకటి రేయి

నీ...కన్నులలోనా..

ఎన్నో..ఎన్నో..ఎన్నో..

కిరణాలు మెరిశాయి


నీవు నా పక్కనుంటే హాయీ


చరణం 2 :


కొనగోట మీటిన మాణిక్య వీణ

కొసరే మమతల తొలకరి వాన..ఆ..ఆ..

కొనగోట మీటిన మాణిక్య వీణ

కొసరే మమతల తొలకరి వాన


కన్ను సైగల కౌగిలింతల 

సన్నజాజి తావీ

ఎన్ని మారులు నిన్ను చూసినా 

దేవ రంభ ఠీవీ

మువ్వల రవళీ మోహన మురళీ..

మువ్వల రవళీ మోహన మురళీ

మధురం మధురం మానస కేళీ..


నీవు నా పక్కనుంటే హాయి

నీవు లేకుంటే చీకటి రేయి

నీ...కన్నులలోనా..

ఎన్నో..ఎన్నో..ఎన్నో..

కిరణాలు మెరిశాయి


నీవు నా పక్కనుంటే హాయీ


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు