RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ontarinaipoyanu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ontarinaipoyanu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మార్చి 2025, సోమవారం

ఒంటరినైపోయాను | Ontarinai poyanu | Song Lyrics | Gulebakavali Katha (1962)

ఒంటరినైపోయాను



చిత్రం : గులేబకావళి కథ (1962)

సంగీతం : జోసఫ్ కృష్ణమూర్తి

గీతరచయిత : సి నారాయణ రెడ్డి  

నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి : 


ఒంటరినైపోయాను... 

ఇక ఇంటికి ఏమనిపోనూ

ఒంటరినైపోయాను... 

ఇక ఇంటికి ఏమనిపోనూ

ఒంటరినైపోయాను... 


చరణం 1 :


నాపై ఆశలు నిలుపుకున్న... 

నా తల్లి ఋణము చెల్లించనైతిని

నాపై ఆశలు నిలుపుకున్న... 

నా తల్లి ఋణము చెల్లించనైతిని

ఎవరికీ గాక...  ఏ దరిగానక

ఎవరికీ గాక...  ఏ దరిగానక 

చివికి చివికి నే మ్రోడైపోతిని


ఒంటరినైపోయాను... 

ఇక ఇంటికి ఏమనిపోనూ

ఒంటరినైపోయాను... 


చరణం 2 :


నన్నే దైవమని నమ్ముకున్న 

నా ఇల్లాలిని ఎడబాసితిని

నన్నే దైవమని నమ్ముకున్న 

నా ఇల్లాలిని ఎడబాసితిని

బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి... 

ఈ బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి... 

ఈ బండలలో ఒక బండనైతిని


ఒంటరినైపోయాను... 

ఇక ఇంటికి ఏమనిపోనూ

ఒంటరినైపోయాను... 


చరణం 3 :


వలచిన కన్యను వంచనజేసి... 

నలుగురిలో తలవంపులుజేసి

వలచిన కన్యను వంచనజేసి... 

నలుగురిలో తలవంపులుజేసి

గుండె ఆవిరైపోవుచుండ... 

ఈ గుండె ఆవిరైపోవుచుండ

ఈ మొండి బ్రతుకు నేనీడ్చుచుంటిని


ఒంటరినైపోయాను... 

ఇక ఇంటికి ఏమనిపోనూ

ఒంటరినైపోయాను... 

నే  ఒంటరినైపోయాను...  


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు