RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
madhuvolakabose nee chilipi kallu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
madhuvolakabose nee chilipi kallu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఫిబ్రవరి 2022, బుధవారం

మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు | Madhu Olakabose | Song Lyrics | Kannavari Kalalu (1974)

మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు



చిత్రం: కన్నవారి కలలు (1974) 

సంగీతం: వి. కుమార్ 

గీతరచయిత: రాజశ్రీ 

నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల 


పల్లవి: 


మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు 

అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 

మధువొలక బోసే ఈ చిలిపి కళ్ళు 

అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 


మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు 

అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 


చరణం 1: 


అడగకనే ఇచ్చినచో అది మనసుకందమూ 

అనుమతినే కోరకనే నిండేవు హృదయమూ 

తలవకనే కలిగినచో అదిప్రేమ బంధమూ 

బహుమతిగా దోచితివీ నాలోని సర్వమూ 

మనసు మనసుతో... ఊసులాడనీ 

మూగభాషలో... బాసచేయనీ 

ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ 


మధువొలకబోసే ఈ చిలిపి కళ్ళు 

అవి నాకు వేసే బంగారు సంకెళ్ళూ 


చరణం 2: 


గగనముతో కడలి చెలి పలికినది ఏమనీ 

తలపులకు.. వలపులకు.. సరిహద్దు లేదనీ 

కుసుమముతో ఆ భ్రమరం తెలిపినది ఏమనీ 

జగమునకు మన చెలిమి ఆదర్శమౌననీ 

కలలు తీరగా... కలిసి పొమ్మనీ 

కౌగిలింతలో... కరిగి పొమ్మనీ 

ఈ నాటి హాయి వెయ్యేళ్ళు సాగాలనీ 


మధువొలకబోసే... హా.. 

ఈ చిలిపి కళ్ళు...ఆ.. 

అవి నాకు వేసే.. ఆ.. 

బంగారు సంకెళ్ళూ...


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు