RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
Gorantha Sureedu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gorantha Sureedu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మే 2026, శుక్రవారం

గోరంత సూరీడు ఊరంత వెలిగేడు | Gorantha Sureedu | Song Lyrics | Pelli Chesi Chupistam (1983)

గోరంత సూరీడు ఊరంత వెలిగేడు


చిత్రం : పెళ్ళి చేసి చూపిస్తాం (1983)

సంగీతం  :  రామకృష్ణం రాజు

గీతరచయిత  :  రాజశ్రీ

నేపధ్య గానం  :  బాలు, సుశీల


పల్లవి  :


గోరంత సూరీడు... 

ఊరంత వెలిగేడు

నీ కంటిలో పాపలా... 

నా గుండెలో పాటగా


గోరంత సూరీడు... 

ఊరంత వెలిగేడు

నీ కంటిలో పాపలా... 

నా గుండెలో పాటగా


కొనచూపే రాగాలుగా.. 

చురునవ్వే తాళాలుగా

కొనచూపే రాగాలుగా.. 

చిరునవ్వే తాళాలుగా

చిరునవ్వే తాళాలుగా...


గోరంత సూరీడు... 

ఊరంత వెలిగేడు

నీ కంటిలో పాపలా... 

నా గుండెలో పాటగా


చరణం 1 :


సొగసే తూరుపు సింధూరం... 

మనసే వాడని మందారం

నిలువెల్ల హరివిల్లై నిలిచే 

ఆమని నీ రూపం


తొణికే వేకువ నీ పిలుపు... 

ఉరికే వెల్లువ నా తలపు

తొలిసంధ్య తొలిసారి 

పలికే పల్లవి నీ చూపు


నీ దోర అందాల పందిళ్ళలోనా.. 

తేనెల్ల వానల్లు చిందుంచుకోనా

నీ కళ్ళ వాకిళ్ళ నీరెండలోనా... 

అచ్చట్లు ముచ్చట్లు ఆరేసుకోనా


ఈవేళా... ఏవేళా... 

సాగేను నీ తోడుగా


గోరంత సూరీడు... 

ఊరంత వెలిగేడు

నీ కంటిలో పాపలా... 

నా గుండెలో పాటగా


చరణం 2 :


విరిసే పువ్వులు నీ కోసం... 

వీచే గాలులు నా కోసం

మలిసంధ్య మనకోసం 

పలికే మంగళ సంగీతం


పడమట ఎర్రని ఆకాశం... 

పరచెను కుంకుమ నీ కోసం

పడిలేచే ప్రతి కెరటం 

కసిగా పొంగెను నా కోసం


నీ నవ్వు లోగిళ్ళ నీడల్లలోనా.. 

బంగారు కలలన్నీ 

పండించుకోనా

నీ లేత చెక్కిళ్ళ అద్దాలలోనా... 

నా ముద్దు మురిపాలు 

నే చూసుకోనా


ఈవేళా... ఏవేళా... 

సాగేను నీ నీడగా


గోరంత సూరీడు... 

ఊరంత వెలిగేడు

నీ కంటిలో పాపలా... 

నా గుండెలో పాటగా


కొనచూపే రాగాలుగా.. 

చిరునవ్వే తాళాలుగా

కొనచూపే రాగాలుగా.. 

చిరునవ్వే తాళాలుగా

చురునవ్వే తాళాలుగా...


గోరంత సూరీడు... 

ఊరంత వెలిగేడు

నీ కంటిలో పాపలా... 

నా గుండెలో పాటగా


- పాటల ధనుస్సు 



పాటల ధనుస్సు పాపులర్ పాట

పరువం పొంగే వేళలో | Paruvamu Ponge Velalo | Song Lyrics | Atma Gowravam (1966)

పరువం పొంగే వేళలో పరదాలవెందుకో చిత్రం: ఆత్మగౌరవం (1966) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: ఘంటసాల, సుశీల పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు