RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, మార్చి 2026, మంగళవారం

ఇది పువ్వులు పూయని తోట | Idi Puvvulu Pooyani Thota | Song Lyrics | Vetagadu (1979)

ఇది పువ్వులు పూయని తోట


చిత్రం : వేటగాడు (1979)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  ఎస్ జానకి 


పల్లవి :


ఆ..ఆ.. ఓ..ఓ..ఓ..ఓ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ


ఇది పువ్వులు పూయని తోట..

ఏ ప్రేమకు నోచని కోట..

పగిలిన నాగుండెలలో..

పగిలిన నాగుండెలలో..

రగులుతున్న రాగం .. 

ఈ పాటా..ఆ..ఆ..ఆ..ఆ


ఇది పువ్వులు పూయని తోట.. 

ఏ ప్రేమకు నోచని కోట..ఆ..ఆ.ఆ 


చరణం 1 :


పువ్వులకే నవ్వులు నేర్పిన 

ప్రేమతోట.. ఇది ఒక నాడు..

చిగురించన మోడులకు..

నిదురించని గుండెలలో..

చితిపేర్చిన వల్లకాడు..ఈ నాడు..


కట్టుకున్న తాళి కోసం.. 

కన్న బిడ్డ రోజా కోసం..

కట్టుకున్న తాళి కోసం.. 

కన్న బిడ్డ రోజా కోసం..

ఇక్కడే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..  

కదులుతూంది వ్యధతో ఒక ప్రాణం.. 

ఇది పువ్వులు పూయని తోట.. 

ఏ ప్రేమకు నోచని కోట..


చరణం 2 :


శీలానికి కాలం మూడి.. 

కాలానికి ఖర్మం కాలీ

న్యాయానికి గాయం తగిలీ.. 

గాయంలో గేయం రగిలి

నెత్తురిలో దీపం వెలిగే.. 

వెలుతురుకే శాపం తగిలే


ఇది మాతృహృదయమే 

మృత్యు నిలయమయి 

ఎగసిన విలయ తరంగం..ఊ

మది రుద్రవీణ నిర్విద్రగానమున 

పలికే మరణమృదంగం....


అందుకే..ఏ..ఏ..ఏ..ఏ..

పలుకుతుంది శ్లోకం... 

నా శోకం....ఊ..ఊ


ఇది పువ్వులు పూయని తోట..

ఏ ప్రేమకు నోచని కోట..ఆ..ఆ..ఆ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు