RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, మార్చి 2026, శుక్రవారం

బంగారు బాతు గుడ్డు | Bangaru Bathu Guddu | Song Lyrics | Vetagadu (1979)

బంగారు బాతు గుడ్డు 


చిత్రం : వేటగాడు (1979)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల  


పల్లవి :


బంగారు బాతు గుడ్డు...

బందారు తొక్కుడు లడ్డు..

బంగారు బాతు గుడ్డు...

బందారు తొక్కుడు లడ్డు..


సయ్యనవే.... నా సరసకు రావే....

సయ్యనవే.... నా సరసకు రావే....

చక్కెర తునుక కిక్కురమనక.. 

పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డూ..

నా లడ్డు..ఊ..ఊ... గాడిద గుడ్డు..


ఆ..బంగారు బాతు గుడ్డు...

బందారు తొక్కుడు లడ్డు..


చరణం 1 :


తీగ నడుములో...  రాగమున్నది..

పాల సొగసులో.... మీగడున్నదీ....

వయసు వరదలా... పొంగుతున్నదీ..

మనసు మరదల అంటూ వున్నది..


తుంటరి గుంట..హ్హా..హ్హా..హ్హా 

వంటరిగుంటే..హ..

తుంటరి గుంట వంటరిగుంటే.. 

వంటికిమంచిది కాదీ పొద్దు... 

లడ్డు..నా లడ్డు..

గాడిద గుడ్డు..ముహ్హూ..ఊ


అబ్బాయి వళ్ళు ఎలా వున్నది..

అమ్మాయి వాటం తెలియకున్నదీ..

అబ్బాయి వళ్ళు ఎలా వున్నది..

అమ్మాయి వాటం తెలియకున్నదీ..

చేయి తగిలినా చెంప పగిలినా 

తడిమి చూసుకొని పడతావయ్యో 

రోడ్డు.. ఓరి జిడ్డూ..

గాడిద గుడ్డు..ఉహ్హూ..!!


ఆ..బంగారు బాతు గుడ్డు.. షటాప్.

బందారు తొక్కుడు లడ్డు.. ఛా పో..


చరణం 2 :


కస్సు మన్నదీ  గడసు చిన్నదీ..

కిస్సు..కిస్సనీ అడుగుతున్నదీ..

పగటి చుక్కలా వెలుగుతున్నదీ..ఈ

పడుచు దిక్కునా ఎదుటే వున్నదీ..


లకుముకి పిట్ట..త్ప్రూ..హూ..

తికమకపెడితే..ఆహా..

లకుముకి పిట్ట..తికమకపెడితే....

చెకుముకి దెబ్బ తినిపిస్తానే 

లడ్డు..నా లడ్డూ..

గాడిద గుడ్డు..! ముహ్హూ...


హల్లో మిస్టర్..అడవిరాముడు..!! 

హో..హో..హో..హో..

అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు..!! 

పోయీ..పోయ్ పపబ్బాయి..

హల్లో మిస్టర్ అడవిరాముడు....

అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు

తాత తుపాకి పాత గిరాకీ..

పిల్ల చలాకీ చూపిస్తాలే..

చూడు..ఓరి జిడ్డూ

గాడిద గుడ్డు..! ముహ్హూ


బంగారు బాతు గుడ్డు..!! 

షటాప్.

బందారు తొక్కుడు లడ్డు..!! 

ఛా పో..

సయ్యనవే..!! ముహ్హూ..

నా సరసకు రావే..!! 

వ్వే..వ్వే..వ్వే..

సయ్యనవే.....నా సరసకు రావే..ఏ..

చక్కెర తునుక కిక్కురమనక 

పక్కకు వస్తే చేరుస్తానే 

ఒడ్డూ..డూ..డూ..డూ

గాడిద గుడ్డు....ముహ్హూ..ఊ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు