RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, డిసెంబర్ 2025, సోమవారం

నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను | Nee Raju Piliechenu | Song Lyrics | Mangamma Sapatham (1965)

నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను 



చిత్రం : మంగమ్మ శపధం (1965)

సంగీతం : టి.వి. రాజు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి:


ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. 

ఊఁహూఁహూఁ..

ఆ.. ఆ.. ఆ.. ఆ..

నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను

ఈ రేయి నీదే కదా..ఆ.. 

చెలి నా రాణి నీవే కదా

ఆ.. ఆ.. ఆ..

నా రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను

ఈ రేయి నాదే కదా..ఆ.. 

ఇక నీ రాణి నేనే కదా


చరణం 1:


నిన్ను చూచి నీ వన్నె చూచి.. 

నను నేనె మరిచేనులే

నను నేనే మరిచేనులే..

ఈనాటికైనా ఏనాటికైనా...

ఈనాటికైనా ఏనాటికైనా.. 

నేనే.. నీలో.. నిలిచేనులే..

నీ రాజు పిలిచెను.. 

రేరాజు నిలిచెను

ఈ రేయి నీదే కదా..ఆ.. 

చెలి నా రాణి నీవే కదా


చరణం 2:


ఇన్నినాళ్ళు ఈ నీలి కళ్ళు.. 

ఏ కోనలో దాగెనో..ఓ..

ఏ కోనలో దాగెనో..

నే కోరుకున్న నా స్వామి కోసం..

నే కోరుకున్న నా స్వామి కోసం.. 

ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే..

నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను

ఈ రేయి నీదే కదా..ఆ.. 

చెలి నా రాణి నీవే కదా

ఆ.. ఆ.. ఆ..

నా రాజు పిలిచెను.. 

రేరాజు నిలిచెను

ఈ రేయి నాదే కదా..ఆ.. 

ఇక నీ రాణి నేనే కదా

ఆ.. ఆ.. ఆ.. ఆహాహా..

ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ..

ఆ.. ఆ.. ఆ.. ఆహాహా..

ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు