RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, డిసెంబర్ 2025, ఆదివారం

గుమ్మ చూపు నిమ్మ ముల్లు | Gumma Chupu Nimma Mullu | Song Lyrics | Mangamma gari Manavadu (1984)

గుమ్మ చూపు నిమ్మ ముల్లు


చిత్రం :  మంగమ్మగారి మనవడు (1984)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  బాలు, ఎస్. పి. శైలజ


పల్లవి:


గుమ్మ చూపు నిమ్మ ముల్లు ..

గుచ్చూకుంటే గుండె ఝల్లు

ఝల్లంటే ఝల్లే కాదూ..ఊ..ఊ..ఊ

చిత్తకార్తె చినుకు జల్లూ..ఊ..

చిత్తకార్తే చినుకుజల్లు


జల్లూ..జల్లూ..జల్లూ..జల్లూ..

జల్లు..జల్లూ..జల్లు..జల్లూ..

గుమ్మ చూపు నిమ్మ ముల్లు ..

గుచ్చూకుంటే గుండె జల్లు..

ఆ..హా..ఓయీ..హోయీ


బావ చూపు రేగు ముల్లు..

నాటుకుంటే వల్లు జిల్లూ..

జిల్లంటే జిల్లే కాదు..ఊ..ఊ..ఊ

మాఘ మాసం మంచు జిల్లూ..

మాఘమాసం మంచు జిల్లూ


జిల్లు..జిల్లూ..జిల్లు..జిల్లూ...

జిల్లు..జిల్లూ..జిల్లు..జిల్లూ

బావ చూపు రేగు ముల్లు..

నాటుకుంటే వల్లు జిల్లూ..

ఆ..హా..అహా..హా


చరణం 1:


బుంగమూతి బుజ్జి మల్లీ..ఈ..ఈ..ఈ

ముడుచుకొన్న మొగ్గమల్లీ..ఈ..ఈ..ఈ..ఈ ...

బుంగమూతి బుజ్జి మల్లీ..ఈ..ఈ..ఈ

ముడుచుకొన్న మొగ్గమల్లీ..ఈ..ఈ..ఈ..ఈ ...


ఇంతలోనే..వింతగానే..

అరె ఇంతలోనే..వింతగానే..

విచ్చుకున్నావే..ఏ..ఏ..ఏ..

చెంగు విసురుతున్నావే..ఏ..ఏ

విచ్చుకున్నావే..ఏ..ఏ..ఏ..

చెంగు విసురుతున్నావే..ఏ..ఏ


నీ చేతి మెరుపు..ఓ..రేపింది వలపు

నీ చేతి మెరుపు..ఓ..రేపింది వలపు

అంతే మరి సరాసరి..

వయసు విచ్చిందీ.. 

నీ వరస మెచ్చింది

వయసు విచ్చిందీ..

ఈ నీ వరస మెచ్చింది

అరె..హోయీ..హోయి..ఆ ఆఅ హా...

గుమ్మ చూపు నిమ్మ ముల్లు ..

గుచ్చూకుంటే గుండె ఝల్లు


చరణం 2:


మురిపెమంటే ఎరగనోడివే..ఏ..ఏ..ఏ..

ఈ ముద్దుమాటలాడనొడివే..ఏ..ఏ..ఏ..ఏ

అయ్యో...మురిపెమంటే ఎరగనోడివే..ఏ..ఏ..ఏ..

ఈ ముద్దుమాటలాడనొడివే..ఏ..ఏ..ఏ..ఏ


కొమ్ములొచ్చినా..అరె..కోడగిత్తలా...

కొమ్ములొచ్చినా..అరె..కోడగిత్తలా...

కుమ్ముతున్నావే..ఏ..ఏ..ఏ..

నన్నే కమ్ముకున్నావే..ఏ..ఏ

కుమ్ముతున్నావే..ఏ..ఏ..ఏ..

నన్నే కమ్ముకున్నావే..ఏ..ఏ


నీ మాట విసురూ..ఊ..

రేపింది పొగరూ...

నీ మాట విసురూ..ఊ..

రేపింది పొగరూ...


రోషం పుట్టి..మీసం తట్టి 

కాలుదువ్వానే..

సరసాలు రువ్వానే.. అరె..

రోషం పుట్టి..మీసం తట్టి 

కాలుదువ్వానే..

సరసాలు రువ్వానే.. అరె..



హోయీ..హోయి..హోయిహోయి..

హోయీ..హోయీ..


బావ చూపు రేగు ముల్లు..

నాటుకుంటే వల్లు జిల్లూ....

గుమ్మ చూపు నిమ్మ ముల్లు ..

గుచ్చూకుంటే గుండె ఝల్లు

జిల్లంటే జిల్లే కాదు..ఊ..ఊ..ఊ

మాఘ మాసం మంచు జిల్లూ..

మాఘమాసం మంచు జిల్లూ


గుమ్మ చూపు నిమ్మ ముల్లు ..

గుచ్చూకుంటే గుండె ఝల్లు

బావ చూపు రేగు ముల్లు..

నాటుకుంటే వల్లు జిల్లూ....

అరె..హోయీ..హోయి..ఆ ఆఅ హా..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు