RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, నవంబర్ 2025, ఆదివారం

స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు | Swagatham Oho Chilipinavvula | Song Lyrics | Atmeeyulu (1969)

స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు


చిత్రం : ఆత్మీయులు (1969)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : పి. సుశీల


పల్లవి :


స్వాగతం ఓహో 

చిలిపి నవ్వుల శ్రీవారు

సోగకనులు సైగ చేస్తే 

ఆగలేని దొరగారు


స్వాగతం ఓహో 

చిలిపి నవ్వుల శ్రీవారు

సోగకనులు సైగ చేస్తే 

ఆగలేని దొరగారు


చరణం 1 : 


కొంగు తగిలిందా పొంగిపోతారు...

కొంగు తగిలిందా పొంగిపోతారు...

కోరి రమ్మంటే బిగిసిపోతారు

ఎందుకో  ఎందుకో  ఈ బింకము


అలిగినకొలది అందము... 

అబ్బాయిగారి కోపము

అలిగినకొలది అందము... 

అబ్బాయిగారి కోపము

పిలిచిన ప్రేయసికి 

ఇదేనా కానుక.. మీ కానుక

బెట్టుచాలును దొరగారు..


స్వాగతం ఓహో 

చిలిపి నవ్వుల శ్రీవారు

సోగకనులు సైగ చేస్తే 

ఆగలేని దొరగారు


చరణం 2 :


అందమంతా విందు చేస్తే 

అదిరిపడతారే

అందమంతా విందు చేస్తే 

అదిరిపడతారే

పొందుకోరి చెంత చేర 

బెదిరిపోతారే

సరసమొ...  విరసమొ...  

ఈ మౌనము


అందిన చిన్నది చులకన.. 

అందనిదెంతో తియ్యన

అందిన చిన్నది చులకన.. 

అందనిదెంతో తియ్యన

అవతల పెట్టండి... 

తమాషా పోజులు మహారాజులు

అధిక చక్కని దొరగారు...


స్వాగతం ఓహో 

చిలిపి నవ్వుల శ్రీవారు

సోగకనులు సైగ చేస్తే 

ఆగలేని దొరగారు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు