RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, నవంబర్ 2025, ఆదివారం

రావోయి రావోయి రాలుగాయి | Ravoyi Ravoyi Ralugayi | Song Lyrics | Alibaba 40 Dongalu (1970)

రావోయి రావోయి రాలుగాయి



చిత్రం: ఆలీబాబా 40 దొంగలు (1970)

సంగీతం: ఘంటసాల

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


లా...ల..లల.లా.లలాలాలా

ఆకతాయి .. ఒట్టి ఆకతాయి ..

హ.. హా .. హా


రావోయి రావోయి రాలుగాయి

రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్


చరణం 1:


నీ కోసమే రేయి ఆగింది

నిను చూసి తనువేమో రేగింది

మదిలోని సెగలోన మరిగింతునోయి

మదిలోని సెగలోన మరిగింతునోయి

దిక్కుల తీరే చుక్కల లోకం 

చూపించేనోయీ..ఈ..


రావోయి రావోయి రాలుగాయి..


చరణం 2:


కొండల్లో తిరిగేటి సింహాము

వేసింది కుందేటి వేషము

ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి

ఆ గుట్టు నా గుండె పసిగెట్టెనోయి

మంచి తరుణం ఇది.. 

మించి పోవునని మాటు వేసినోయీ..ఈ..


రావోయి రావోయి రాలుగాయి..


చరణం 3:


కొల్లగొట్టి కోటలెన్నో కట్టారు

కత్తుల బోనులో కాలు పెట్టారు

పులినోట తల దూర్చి పోలేరులే

పులినోట తల దూర్చి పోలేరులే

ఎత్తులు జిత్తులు ఎన్నైనా 

గమ్మత్తుగ చిత్తవులే..ఏ..


రావోయి రావోయి రాలుగాయి


మక్కువయేలేని మగువ 

పక్కలోన బల్లెము

కంగారైతే కలిసొచ్చే 

కాలమే కాదురోయ్

దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు

దొడ్దిలోన దొరగార్లు దొర్లిపోతున్నారు

ఇంటిలోన సర్కారేమో 

భలే ఇరుకున పడ్డారూ..ఊ..


రావోయి రావోయి రాలుగాయి

రాకరాక వచ్చావు రాత్రి ఉండిపోవోయ్

రావోయి.. రావోయి.. రావోయి..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చీకటిలో కారు చీకటిలో | Cheekatilo Karu Cheekatilo | Song Lyrics | Manushulu Marali (1969)

చీకటిలో కారు చీకటిలో చిత్రం : మనుషులు మారాలి (1969) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : శ్రీ శ్రీ నేపధ్య గానం : ఘంటసాల పల్లవి : చీకటిలో కారు ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు