RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, నవంబర్ 2024, మంగళవారం

చెక్కిలి మీద కెంపులు మెరిసే | Chekkilimeeda Kempulu merise | Song Lyrics | Bangaru Kalalu (1974)

చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా



చిత్రం :  బంగారు కలలు (1974)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  సుశీల, రామకృష్ణ


పల్లవి:


చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా

చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా

చెలికానిపై అలకెందుకే.. 

నీ జతగానితో తగవెందుకే..


చిలకను చూసి సిగ్గుపడే ఓ గోరింకా...

వలపే కానీ నీపై అలక లేదింకా

అనురాగమే గెలిచిందిలే.. 

నీ మనసేమిటో తెలిసిందిలే..


చరణం 1:


గగనాన మేఘం తొలగిందిలే...

రవి మోము నేడు వెలిగిందిలే..

గగనాన మేఘం తొలగిందిలే...

రవి మోము నేడు వెలిగిందిలే..


అనుమానాలు తీరాలి.. 

అభిమానాలు పెరిగాయి..

అనురాగమే గెలిచిందిలే.. 

నీ మనసేమిటో తెలిసిందిలే..


చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా

చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా

చెలికానిపై అలకెందుకే..


చరణం 2:


నా ప్రేమగీతం.. నీవేలే

ఆపాతభావం.. నీవేలే...

నా ప్రేమగీతం.. నీవేలే

ఆపాతభావం.. నీవేలే...


కమ్మని రాగం నీవైతే.. 

కలిసిన తాళం నీవైతే...

ఆ గానమే.. మన ప్రాణము..

నీ మీదనే... నా ధ్యానము..


చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా

చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా

చెలికానిపై అలకెందుకే..


చరణం 3:


నీ బుగ్గ మీద నే చుక్కనే..

పాదాల పైనా పారాణినే...

నీ బుగ్గ మీద నే చుక్కనే..

పాదాల పైనా పారాణినే...


పచ్చని పెళ్ళిపందిరిలో.. 

ముచ్చట గొలిపే సుందరినే...

ఈనాటితో నవజీవనం... 

మన జీవితం బృందావనం...


చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా

చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా

అనురాగమే గెలిచిందిలే..

నీ మనసేమిటో తెలిసిందిలే..



- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు