లేలేలే నా రాజా
చిత్రం : ప్రేమనగర్ (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి
పల్లవి :
లే లే లే... లేలేలే నా రాజా...
లేలే నా రాజా
లేలేలే నా రాజా... లేలే నా రాజా
లేవనంటావా...
నన్ను లేపమంటావా
నిద్దుర లేవనంటావా...
నన్ను లేపమంటావా
లే లే లే... లేలేలే నా రాజా...
లేలే నా రాజా
చరణం 1 :
పెటపెటలాడే పచ్చివయసు
పై పై కొచ్చింది
వచ్చి వచ్చి...
మెరమెరలాడే మేని నునుపు
మెత్తగా తగిలింది
హాయ్.. పెటపెటలాడే పచ్చివయసు
పై పై కొచ్చింది
మెరమెరలాడే మేని నునుపు
మెత్తగా తగిలింది
మెత్తని మత్తు .. వెచ్చని ముద్దు ..
ఒద్దిక కుదిరింది
ఇద్దరు ఉంటే ఒక్కరికేల
నిద్దుర వస్తుంది
రా రా రా రా.. నా రోజా...
రావే నా రోజా
రా.. నా రోజా... రావే నా రోజా
రాతిరయ్యిందా.. హా...
నన్ను లేచిరమ్మందా.. హా
రాతిరయ్యిందా.. హా...
నన్ను లేచిరమ్మందా.. హా
లే లే లే లేలేలే నా రాజా...
లేలే నా రాజా
చరణం 2 :
నల్లనల్లని కన్నులలోన
ఎర్రని కైపుంది
ఎర్ర ఎర్రని కుర్రతనమును
జుర్రుకుతాగాలి హహ హహ
నల్లనల్లని కన్నులలోన
ఎర్రని కైపుంది
ఎర్ర ఎర్రని కుర్రతనమును
జుర్రుకుతాగాలి
తాగిన రాత్రి తాగని పగలు...
ఒక్కటి కావాలి
తాగిన రాత్రి తాగని పగలు...
ఒక్కటి కావాలి
ఆఖరి చుక్కా.. హా.. చక్కని చుక్కా.. హా...
అప్పుడు ఇవ్వాలి
రా రా రా రా.. నా రోజా...
రావే నా రోజా
రా.. నా రోజా... రావే నా రోజా
రాతిరయ్యిందా... హా ...
నన్ను లేచిరమ్మందా.. హా
రాతిరయ్యిందా.. హా..
నన్ను లేచిరమ్మందా.. హా
లే లే లే... లేలేలే నా రాజా...
లేలే నా రాజా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి