RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, సెప్టెంబర్ 2024, బుధవారం

శరణువేడెద యజ్ఞ సంభవ రామ | Sharanu Vededa | Song Lyrics | Annamacharya Keerthana

శరణువేడెద యజ్ఞ సంభవ రామ 



సాహిత్యం : శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య 

రాగం : మోహన 

ఆల్బం : శ్రీరామ గానామృతం 

గానం : పి సుశీల 


పల్లవి :


శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ 

అరసి రక్షించుమమ్ము అయోధ్యారామ ||


చరణం 1 :


ధారుణిలో దశరథ తనయ రామ |

చేరిన యహల్యను రక్షించినరామ 

వారిధి బంధన కపి వల్లభ రామ | 

తారక బ్రహ్మమైన సీతారామ ||


శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ 

అరసి రక్షించుమమ్ము అయోధ్యారామ ||


చరణం 2 :


ఆదిత్య కులాంబుధి మృగాంతక రామ 

హర కోదండ భంజనము చేకొనినరామ 

వేద శాస్త్ర పురాణాదివినుతరామ  

ఆది గొన్నతాటకా సంహార రామ ||


శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ 

అరసి రక్షించుమమ్ము అయోధ్యారామ ||


చరణం 3 :


రావణుని భంజించినరాఘవరామ

వావిరి విభీషణ వరద రామ 

సేవలనలమేల్మంగతో శ్రీవేంకటేశుడవై

ఈవల దాసులెల్ల ఏలినట్టిరామ..


శరణువేడెద యజ్ఞసంభవ శ్రీరామ 

అరసి రక్షించుమమ్ము అయోధ్యారామ ||


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు