కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయ్
చిత్రం : పిడుగు రాముడు (1966)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
ఓ..ఓ..ఓ..ఓ...ఓ...
కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయ్
కమ్మంగా గున్నామావి కాపు కాసిందోయ్
కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయ్
కమ్మంగా గున్నామావి కాపు కాసిందోయ్
రాజా.. రాజా.. నా రాజా...
చరణం 1 :
చిలిపి గాలి విసిరెనులే...
వలపు వాన కురిసెనులే... రాజా
చిలిపి గాలి విసిరెనులే...
వలపు వాన కురిసెనులే... రాజా
గిలిగింతలు కలిగెనులే..
ఘుమాఘుమాలే...
ఈ గాలిలో ఈ వేళలో ఏవేవో
తలపులు చిగురించెనులే
కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయ్
కమ్మంగా గున్నామావి కాపు కాసిందోయ్
రాజా.. రాజా.. నా రాజా...
చరణం 2 :
పైరు పాట పాడింది
మొయలు నాట్యమాడింది... రాజా
పైరు పాట పాడింది
మొయలు నాట్యమాడింది... రాజా
పూలతావి మత్తు జల్లి లాలించింది...
పదేపదే అదేమిటో నా ఒళ్ళు
పరవశమైపోయినది
కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయ్
కమ్మంగా గున్నామావి కాపు కాసిందోయ్
రాజా.. రాజా.. నా రాజా...
చరణం 3 :
పక్కనెవరో నిలిచినట్టు
పైటకొంగు లాగినట్టు...
ఏమేమో అనిపించును రాజా...
పక్కనెవరో నిలిచినట్టు
పైటకొంగు లాగినట్టు...
ఏమేమో అనిపించును రాజా...
ఔనౌనులే.. సిగౌనులే...
వయసున చెలరేగిన భ్రమలివిలే...
కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయ్
కమ్మంగా గున్నామావి కాపు కాసిందోయ్
కొమ్మల్లో పాలపిట్ట కూత కూసిందోయ్
కమ్మంగా గున్నామావి కాపు కాసిందోయ్
రాజా.. రాజా.. నా రాజా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి