RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, డిసెంబర్ 2023, ఆదివారం

ఈ పుట్టినరోజు నీ నోములు పండిన రోజు | Ee Puttinaroju | Song Lyrics | Kanchukota (1961)

ఈ పుట్టినరోజు నీ నోములు పండిన రోజు



చిత్రం: కంచుకోట (1961)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: సుశీల



పల్లవి:


ఈ పుట్టినరోజు.. నీ నోములు పండిన రోజు

దివిలో భువిలో కనివిని ఎరుగని.. 

అందాలన్ని అందే రోజు


ఈ పుట్టినరోజు.. నీ నోములు పండిన రోజు

దివిలో భువిలో కనివిని ఎరుగని.. 

అందాలన్ని అందే రోజు


ఏ అందాలు..


చరణం 1:


తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ

తళతళ మెరిసే తారకలారా ఇలకే దిగిరండీ

మీలో విరిసే లేత వెలుగులు.. 

మా చెలి కన్నుల నింపండి

ఆ వెలుగులలో నా చెలి ప్రియుడు ఆనందించాలి


ఈ పుట్టినరోజు..నీ నోములు పండినరోజూ...


చరణం 2:


అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా ..ఆ...ఆ

అలల పూల ఉయ్యాలల ఆడుకునే హంసలారా

మీ నడకల వయ్యారం మా చెలికే ఇవ్వరారా .. ఆ...ఆ

ఆ వయ్యారం చూసి చూసి.. ఆమె ప్రియుడు మురియాలీ


ఈ పుట్టినరోజు..నీ నోములు పండినరోజూ..


చరణం 3:


పురివిప్పి నటియించు నీలాల నెమలి

పురివిప్పి నటియించు నీలాల నెమలి

మీలోని హొయలంత చెలికియ్యరాదా..ఆ..ఆ

అందాల చెలి నాట్యమాడేటి వేళ

చెలికాని మనసెల్ల విలసిల్ల గలదు...ఆ..ఆ..ఆ..ఆ


ఈ పుట్టినరోజు.. నీ నోములు పండిన రోజు

దివిలో భువిలో కనివిని ఎరుగని.. 

అందాలన్ని అందే రోజు


ఈ పుట్టినరోజు..నీ నోములు పండిన రోజూ...


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు