నువ్వొచ్చి దారిలో అమ్మాయి
చిత్రం : చల్ మోహన రంగ (1978)
సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్)
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
నువ్వొచ్చి దారిలో అమ్మాయి...
నే రివ్వేసి కైపెక్కి కాశాను
నువ్వొచ్చి దారిలో అమ్మాయి...
నే రివ్వేసి కైపెక్కి కాశాను
ముద్దబంతి అద్దకాల ముద్దు లేసి...
ఒళ్లంతా చుడతాను పగ్గమేసి
ఒళ్లంతా చుడతాను పగ్గమేసి
రేకెత్తి పోకోయు కుర్రోడా రేగేది...
ఎందాక చిన్నోడా
రేకెత్తి పో కోయి కుర్రోడా రేగేది...
ఎందాకా చిన్నోడా
ఈ వేడి నిండార నిలవుండిపోవాలి...
నూరేళ్లు కౌగిళు నూరేసుకోవాలి
రేకెత్తి పోకోయి కుర్రోడా రేగేది...
ఎందాకా చిన్నోడా
నువ్వొచ్చి దారిలో అమ్మాయి...
నేరివ్వే సి కైపెక్కి కాశాను
చరణం 1 :
గువ్వలల్లె యవ్వనాలు గుండెల మీదుంటే
ఈ కోడెగాడి కోరికేదో రంకెలు వేస్తోంటే
కళ్లె మేసి ఆపలేని కసి మీదున్నావు
నీ కళ్లతో నా ఒళ్లంతా తెగ తడి మేస్తున్నావు
సిరిమల్లే బుగ్గల మీద చెంగావి పెదవుల మీద
సిరిమల్లే బుగ్గల మీద చెంగావి పెదవుల మీద
మాటేసి కాటేసి మైమరిచిపోతాను
ఆ రోజు రావాలిగా... మరి నా మోజు తీరాలి గా
రేకెత్తి పోకోయి కుర్రోడా...
రేగేది ఎందాకా చిన్నోడా
అరెరె నువ్వొచ్చే దారిలో అమ్మాయి...
నే రివ్వేసి కైపెక్కి కాశాను
చరణం 2 :
పగడాల పడవల్లే నువ్వూగుతూ వస్తుంటే
ఆ జగడాల బిడియాలు సుడి పడిపోతుంటే
జడివాన వరదల్లె నను తడిపేస్తున్నావు
నీ మగసిరిని సెగ చూపి ఆరేస్తున్నావు
ఆ తెరచాప కొండల కేసి నడియేట గెడ పోటేసి
తెరచాప కొండలకేసి నడియేట గెడపోటేసి
దూరాల తీరాల దరి చూసుకుంటాను
తీగల్లె నిన్నల్లుకుంటాను...
నీ చుట్టు మెలితిరిగివుంటాను
రేకెత్తి పోకోయి కుర్రోడా...
రేగేది ఎందాకా చిన్నోడా
నువ్వొచ్చే దారిలో అమ్మాయి...
నేరివ్వేసి కైపెక్కి కాశాను
లాలాలా లాలాల లాలాలా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి