RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, ఆగస్టు 2023, గురువారం

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన | Charanakinkinulu | Song Lyrics | Chelleli Kapuram (1971)

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన



చిత్రం : చెల్లెలి కాపురం (1971)
సంగీతం: కె వి మహదేవన్
గీతరచయిత : సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం: ఎస్ పి బాలు,
సాకి :

చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన
కర కంకణములు గలగలలాడగ
అడుగులందు కలహంసలాడగా
నడుములో తరంగామ్ములూగగా
వినీల గజభర విలాస బంధుర
తనూలతిక చంచలించిపోగ

పల్లవి :

ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నీ కులుకును గని నా పలుకు విరియ
నీ నటనలు గని నవ కవిత వెలయగ
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ

చరణం 1:

అది యమునా సుందర తీరము.
అది రమణీయ బృందావనము
అది విరిసిన పున్నమి వెన్నెల
అది వీచిన తెమ్మెర ఊయల
అది చల్లని సైకత వేదిక
అట సాగెను విరహిని రాధిక
అది రాధ మనసులో

మాధవుడూదిన రసమయ మురళి గీతిక
ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ
నా పలుకులకెనెయడు కులుకు చూపి
నా కవితకు సరియగు నటన చూపి
ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ

చరణం 2:

హాల నేత్ర సంప్రభాత జ్వాలలు
ప్రసవశరుని దహియించగా
పతిని గోలు పడి రతీదేవి
దుఖితమతియై రోదించగా

హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ
ప్రమధ గణము కనిపించగా
ప్రమదనాద కర పంకజ భ్రాంకృత
ఢమరుధ్వని వినిపించగా
ప్రళయ కరళ సంకలిత భయంకర

జలదరార్భటుల
జలిత దిక్కటుల
జహిత దిక్కరుల వికృత
ఘీంకృతుల సహస్రఫణ
సంచలిత భూత్క్రుతుల

కనులలోన కనుబొమలలోన
అధరమ్ములోన వదనమ్ములోన
కనులలోన కనుబొమలలోన
అధరమ్ములోన వదనమ్ములోన
గళసీమలోన కటసీమలోన

కరయుగములోన పదయుగములోన
నీ తనువులోని అణువణువులోన
అనంత విధముల అభినయించి
ఇక ఆడవే ఆడవే ఆడవే

- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు