RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, ఆగస్టు 2023, బుధవారం

అదిగదిగో శ్రీశైలము | Adigadigo Srisailamu | P Susheela | Album Bhakti Sudha (1991)

అదిగదిగో శ్రీశైలము 



గానం  : P సుశీల ,

రచన  : రోహిణి చంద్ర,

సంగీతం : ఎస్ రాజేశ్వరరావు,

ఆల్బం  : భక్తి సుధ  (1991)

విడుదల : సారెగామా 


అదిగదిగో శ్రీశైలము 

అదిగదిగో శ్రీశైలము

అదిగదిగో శ్రీశైలము

భక్తుల ముక్తి రసాలము 

శివ దేవుని స్థిర విలాసము

భూలోకానా కైలాసము

అదిగదిగో శ్రీశైలము 

అదిగదిగో శ్రీశైలము


చరణం 1 :


గిరిమల్లి చిరునవ్వుల పువ్వుల

పూజించే పరమేశ్వరుడు 

గిరిమల్లి చిరునవ్వుల పువ్వుల

పూజించే పరమేశ్వరుడు 

భ్రమరాంబిక పలువిధముల 

పదముల సేవించే శివశంకరుడు 

భ్రమరాంబిక పలువిధముల 

పదముల సేవించే శివశంకరుడు 

చల్లగ భక్తుల నెల్లర బ్రోవగ 

చల్లగ భక్తుల నెల్లర బ్రోవగ 

మల్లేశ్వరుడై వెలసిన చోటు 

అదిగదిగో శ్రీశైలము 

అదిగదిగో శ్రీశైలము


చరణం 2 :


నీలకంఠ నా తలపై నిలిచి

కలియుగమును కాపాడమని

నీలకంఠ నా తలపై నిలిచి

కలియుగమును కాపాడమని

శైల నాయకుడు శివ శివ 

శివయని  చిరకాలంగా వేడెనని 

శైల నాయకుడు శివ శివ 

శివయని  చిరకాలంగా వేడెనని 

భక్త సులభుడు ఆ ఫల లోచనుడు

భ్రమర విభుఁడై భూతాల నటయట

అదిగదిగో శ్రీశైలము 

అదిగదిగో శ్రీశైలము


చరణం 3 :

పాపనాశనం శాపమోచనము 

శ్రీశైలేశుని దర్శనము

పాపనాశనం శాపమోచనము 

శ్రీశైలేశుని దర్శనము

సౌఖ్యప్రదము సర్వత్రశుభదము

గిరిమల్లేశారాధనము

సౌఖ్యప్రదము సర్వత్రశుభదము

గిరిమల్లేశారాధనము

నిరతపావనము నిత్యమోహనము

నిరతపావనము నిత్యమోహనము

మల్లిఖార్జుని మంత్రధ్వానము


అదిగదిగో శ్రీశైలము 

అదిగదిగో శ్రీశైలము

అదిగదిగో శ్రీశైలము

భక్తుల ముక్తి రసాలము 

శివ దేవుని స్థిర విలాసము

భూలోకనా కైలాసము

అదిగదిగో శ్రీశైలము 

అదిగదిగో శ్రీశైలము


పాటల ధనుస్సు 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు