మనసు మందారం
చిత్రం : రామాపురంలో సీత (1981)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
మనసు మందారం..
ముద్దరాలి వయసు వయ్యారం
చిలిపి సరసాలాడగానే సిగ్గే సింగారం...
ఆ బుగ్గే సింధూరం
మనసు మందారం..
అందగాని వయసు వైభోగం
పరువమందు పదును తేరి పలుకే బంగారం...
ఆ కులుకే గారాబం
చరణం 1 :
నీ చిన్నెలు నీ వన్నెలు...
జీవమున్న అమరావతి శిల్పం
నీ అందెల ఈ చిందులు
దేవలోక హావభావ నాట్యం
నీ చిన్నెలు నీ వన్నెలు...
జీవమున్న అమరావతి శిల్పం
నీ అందెల ఈ చిందులు
దేవలోక హావభావ నాట్యం
దాగి...దాగి.. దాగి దోబూచులాడింది
పొంగే సల్లాపం
మనసు మందారం..
అందగాని వయసు వైభోగం
చిలిపి సరసాలాడగానే సిగ్గే సింగారం...
ఆ బుగ్గే సింధూరం
చరణం 2 :
చిరునవ్వుల సిరివెన్నెల
పందిరేసి సంబరాలు జరిపే
నీ ఒంపులు... నీ సొంపులు
దోరవయసు తోరణాలు నిలిపే
చిరునవ్వుల సిరివెన్నెల
పందిరేసి సంబరాలు జరిపే
నీ ఒంపులు... నీ సొంపులు
దోరవయసు తోరణాలు నిలిపే
ఊగి..ఊగి..ఊగి.. ఉయ్యాలలూగింది
ఉబికే ఉబలాటం
ఆ... ఆ.. మనసు మందారం..
ముద్దరాలి వయసు వయ్యారం
చిలిపి సరసాలాడగానే సిగ్గే సింగారం...
ఆ బుగ్గే సింధూరం
మనసు మందారం..
అందగాని వయసు వైభోగం
పరువమందు పదును తేరి పలుకే బంగారం...
ఆ కులుకే గారాబం
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి