బొంగరాల బీడుకాడ
చిత్రం : బెబ్బులి (1980)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
బొంగరాల బీడుకాడ.. హహాహహా
గింగిరాల గిత్త దూడ... హొహొహొహో
బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్త దూడ
చెంగు చెంగు చెంగుమన్నది
గంగరాయి సెట్టుకాడ.. హహాహాహా
ఉంగరాల సిట్టిపాప.. హేహేహేహే
గంగరాయి సెట్టుకాడ ఉంగరాల సిట్టిపాప
రంగుపొంగు చూడమన్నది
ఓరబ్బీ గిత్తదూడ ఏమన్నది...
ఓయబ్బో గింజమేత పెట్టమన్నది
ఓరబ్బీ గిత్తదూడ ఏమన్నది...
ఓయబ్బో గింజమేత పెట్టమన్నది
బొంగరాల బీడుకాడ.. హహాహహా
గింగిరాల గిత్త దూడ... హొహొహొహో
బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్త దూడ
చెంగు చెంగు చెంగుమన్నది
గంగరాయి సెట్టుకాడ.. హహాహాహా
ఉంగరాల సిట్టిపాప.. హేహేహేహే
గంగరాయి సెట్టుకాడ ఉంగరాల సిట్టిపాప
రంగుపొంగు చూడమన్నది
ఓరబ్బీ గిత్తదూడ ఏమన్నది...
ఓయబ్బో గుంజ కేస్తే గింజుకుంటది
ఓరబ్బీ గిత్తదూడ ఏమన్నది...
ఓయబ్బో గుంజ కేస్తే గింజుకుంటది
చరణం 1 :
అత్తకూతురా.. మేనత్తకూతురా
అర్ధరాతిరి ఈ అత్తరేసుకో
ఇంటికల్లుడా ఓ కొంటెపిల్లడా
నీ అందముండగా... ఈ అత్తరెందుకో
జామురాతిరేలా జాజిపూల జాతరాఎంతమోతరా..
ఇది వింతమోతరా
జామురాతిరేలా జాజిపూల జాతరాఎంతమోతరా..
ఇది వింతమోతరా
జామురాతిరేలా జాజిపూల జాతరా
ఎండమూదరా.. ఇది విందమూదరా
సిగ్గుమొగ్గలేయకుంటే సిగురు మేత పెట్టమంటే
సిలికికుంటలాపమంటా
ఓరబ్బీ గిత్తదూడ ఏమంటది...
ఓలమ్మీ గింజమేత పెట్టమన్నది
ఓరబ్బీ గిత్తదూడ ఏమంటది...
ఓలమ్మీ గింజమేత పెట్టమన్నది
బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్త దూడ
చెంగు చెంగు చెంగుమన్నది
గంగరాయి సెట్టుకాడ ఉంగరాల సిట్టిపాప
రంగుపొంగు చూడమన్నది
ఓరబ్బీ గిత్తదూడ ఏమన్నది...
ఒయమ్మో గుంజ కేస్తే గింజుకుంటది
ఓరబ్బీ గిత్తదూడ ఏమన్నది...
ఒయమ్మో గుంజ కేస్తే గింజుకుంటది
చరణం 2 :
బంతులాడినా పడుచుతోటలో...
మొగ్గు చూసుకో... మొగ్గ కోసుకో
బంతిలాంటిది... ఈ పడుచుదుండగా
మొగ్గలెందుకో... పసికందులెందుకో
చెంతకొస్తే చాలు చెడ్డ సంత గోలరా...
ఎంతమోతరా.. ఇది వింతమోతరా
చెంతకొస్తే చాలు చెడ్డ సంత గోలరా...
ఎంతమోతరా.. ఇది వింతమోతరా
చేతి ముద్దులీయకంటే చేను హద్దు దాటకుంటే
చెంపముద్దరేయమంటా...
ఓరమ్మీ... ఓరబ్బీ గిత్తదూడ ఏమన్నది...
ఓయబ్బో గుంజ కేస్తే గింజుకుంటది
ఓరమ్మీ... ఓరబ్బీ గిత్తదూడ ఏమన్నది...
ఓయబ్బో గుంజ కేస్తే గింజుకుంటది
బొంగరాల బీడుకాడ గింగిరాల గిత్త దూడ
చెంగు చెంగు చెంగుమన్నది
గంగరాయి సెట్టుకాడ ఉంగరాల సిట్టిపాప
రంగుపొంగు చూడమన్నది
ఓరబ్బీ గిత్తదూడ ఏమంటది...
ఓలమ్మీ గింజమేత పెట్టమన్నది
ఓరబ్బీ గిత్తదూడ ఏమంటది...
ఓలమ్మీ గింజమేత పెట్టమన్నది
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి