RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

ఈ చెంపకు శలవీయకు | Eechempaku Selaveeyaku | Song Lyrics | Donga Mogudu (1987)

ఈ చెంపకు శలవీయకు


చిత్రం: దొంగ మొగుడు (1987) 

రచన : వేటూరి 

సంగీతం: చక్రవర్తి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


ఈ చెంపకు శలవీయకు 

ఈ పెదవిని వదిలేయకు 

చాలని అనకు రాతిరి మనకు 

మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... 

హోయ్ 


ఈ చెంపకు శలవీయకు 

ఈ పెదవిని వదిలేయకు 


చరణం 1: 


నీ వేళ్ళు చేసే అల్లరి కుచ్చెళ్ళు 

పాడే పల్లవి 

తుఫాను రేగే ముందర ముస్తాబు 

దేనికి దండగ 

కంటి చూపు చీర కట్టాలి ఒంటిని 

కంచి పట్టు చీర జారాలి నేలనీ 

ఈ వేడీలో వాడనీ ...

ఈ గాలినీ పూలనీ... 

గండి పడ్దది నింగి చెరువుకి 

వెండి వెన్నెల పొంగుతున్నదీ 

గోరింత తుళ్ళింత వెల్లువయ్యేలా.... 

హోయ్ 


ఈ చెంపకు శలవీయకు 

ఈ పెదవిని వదిలేయకు 

చాలని అనకు రాతిరి మనకు 

మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... 

హోయ్ 


చరణం 2: 


పై పైకి రాకు సూర్యుడా పొద్దంటే 

మాకు చేదురా 

తెల్లారుతున్నా తీరక అల్లాడుతోందీ 

కోరికా 

కక్ష గట్టి వచ్చి మా తలుపు తట్టకు 

వెలుగు వలలు తెచ్చి 

మా తలలు పట్టకు 

ఈ రేయిని ఆగనీ... 

ఈ హాయినీ సాగనీ... 

పాలపుంతలో పూల వేడుక 

కౌగిలింతలో ఇలకు జారక 

తాపాల దాహాలు తీరిపోయేలా...


ఈ చెంపకు శలవీయకు 

ఈ పెదవిని వదిలేయకు 

చాలని అనకు రాతిరి మనకు 

మోహాలు సంకెళ్ళు విడిపోనీకు... 

హోయ్ 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి చిత్రం : దానధర్మాలు (1976) సంగీతం : మాస్టర్ వేణు గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్  నేపధ్య గానం : ఎస్ పి బాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు