RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

10, మే 2024, శుక్రవారం

ఇది ప్రేమ సామ్రాజ్యం | Idi Prema Samrajyam | Song Lyrics | Mande Gundelu (1979)

ఇది ప్రేమ సామ్రాజ్యం



చిత్రం :  మండే గుండెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


ఇది ప్రేమసామ్రాజ్యం.. 

ఇది మన్మధ సామ్రాజ్యం

ప్రతి హృదయం ఒక సింహాసనం.. 

ఒక రాజు రాణి పఠాభిషేకం


ఇది ప్రేమసామ్రాజ్యం.. 

ఇది మన్మధ సామ్రాజ్యం

ప్రతి హృదయం ఒక సింహాసనం.. 

ఒక రాజు రాణి పఠాభిషేకం


ఇది ప్రేమసామ్రాజ్యం.... 


చరణం 1 :


ఈ జంటలలో మనమొక జంటై... 

ఒక గంటైనా ఉంటే చాలు

ఈ జంటలకే జేగంటలమై 

మనముంటాము పది కాలాలు


ఈ జంటలలో మనమొక జంటై... 

ఒక గంటైనా ఉంటే చాలు

ఈ జంటలకే జేగంటలమై 

మనముంటాము పది కాలాలు


అందుకే ఉన్నవి పొదరిల్లు... 

పొదరిల్లకు ఉన్నవి పోకిరి కళ్ళు


ఇది ప్రేమసామ్రాజ్యం.. 

ఇది మన్మధ సామ్రాజ్యం


చరణం 2 :


ఈ పువ్వులలో జతపువ్వులమై 

చిరునవ్వులమై ఉందాము

ఈ పచ్చికలో మన మచ్చికలో 

నులి వెచ్చదనం చూదాము

వెచ్చదనాన్ని తెచ్చాము... 

అది మెచ్చుకునేందుకే వచ్చాము


ఇది ప్రేమసామ్రాజ్యం.. 

ఇది మన్మధ సామ్రాజ్యం


చరణం 3 :


చిగురాకులో విరిరేకులలో 

ఎరుపై నునుపై ఉందాము

బిగి కౌగిలో తొలి మైకములో 

సగమూ సగమైపోదాము


చిగురాకులో విరిరేకులలో 

ఎరుపై నునుపై ఉందాము

బిగి కౌగిలో తొలి మైకములో 

సగమూ సగమైపోదాము


అందుకే ఉన్నది యవ్వనము... 

ఈ యవ్వనమందే అనుభవము


ఇది ప్రేమసామ్రాజ్యం.. 

ఇది మన్మధ సామ్రాజ్యం

ప్రతి హృదయం ఒక సింహాసనం.. 

ఒక రాజు రాణి పఠాభిషేకం


ఇది ప్రేమసామ్రాజ్యం.. 

ఇది మన్మధ సామ్రాజ్యం


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

థంబ్స్ అప్ థండర్ కైనా | Thumsup Thunder | Song Lyrics | Jai Chiranjeeva (2005)

థంబ్స్ అప్ థండర్ కైనా చిత్రం : జై చిరంజీవ (2005) సంగీతం : మణిశర్మ గీతరచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రీ  నేపధ్య గానం :  మహాలక్ష్మి అయ్యర్,...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు