ఈ మూగ చూపేలా బావా
చిత్రం: గాలి మేడలు (1962)
సంగీతం: టి.జి. లింగప్ప
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, రేణుక
పల్లవి:
ఈ మూగ చూపేలా బావా...
మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...
నీదరినే చేరి మాటాడనా
ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...
మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...
నీదరినే చేరి మాటాడనా
చరణం 1:
రెప్పేయకుండా ఒకే తీరునా..
నువూ చూస్తే నాకేదో సిగ్గవుతది
ఓ..ఓహొ...
రెప్పేయకుండా ఒకే తీరునా..
నువూ చూస్తే నాకేదో సిగ్గవుతది
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే...
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే....
చేయి చేయీ చేరా విడిపోవులే
ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...
మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...
చరణం 2:
చల్లగ నీ చేయి నన్నంటితే...
చటుకున నా మేను జల్లంటది
అహా..ఆ..
చల్లగ నీ చేయి నన్నంటితే...
చటుకున నా మేను జల్లంటది
నా ముందు నిలుచుండి నువు నవ్వితే
నా ముందు నిలుచుండి నువు నవ్వితే...
నా మనసే అదోలాగ జిల్లంటది ...
ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...
మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...
చరణం 3:
జాగ్రత్త బావా చెయా గాజులూ...
ఇవె కన్నె చిన్నారి తొలిమోజులు
ఓహో...ఓ...
జాగ్రత్త బావా చెయా గాజులూ...
ఇవె కన్నె చిన్నారి తొలిమోజులు
చాటనే ఎలుగెత్తి యీ గాజులే...
చాటనే ఎలుగెత్తి యీ గాజులే....
ఈ వేళ మరేవేళ మన రోజులే..
ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా...
మాటాడగా నేరవా
ఓహో మాటాడదే బొమ్మా...
Just went through the Telugu Song Lyrics and I'm impressed! It's great to see both the Telugu and English lyrics together in one place. Thanks for offering such a fantastic resource for music enthusiasts!
రిప్లయితొలగించండి