RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, జనవరి 2024, మంగళవారం

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ | Idigo Devudu Chesina Bomma | Song Lyrics | Pandanti Kapuram (1972)

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ



చిత్రం: పండంటి కాపురం (1972)

సంగీతం: కోదండపాణి

గీతరచయిత: మైలవరపు గోపి

నేపధ్య గానం:  కోదండపాణి, సుశీల


పల్లవి : 


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...

ఇది నిలిచేదేమో మూడు రోజులు... 

బంధాలేమో పదివేలు 


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...

ఇది నిలిచేదేమో మూడు రోజులు ...

బంధాలేమో పదివేలు...


చరణం: 1 


నదిలో నావ ఈ బ్రతుకు... 

దైవం నడుపును తన బసకు

ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ   

నదిలో నావ ఈ బ్రతుకు.... 

దైవం నడుపును తన బసకు

అనుబంధాలు ఆనందాలు... 

తప్పవులేరా కడవరకు

తప్పవులేరా కడవరకు....


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...

ఇది నిలిచేదేమో మూడు రోజులు... 

బంధాలేమో పదివేలు

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...


చరణం: 2 


రాగం ద్వేషం రంగులురా...  

భోగం భాగ్యం తళుకేరా

ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 

రాగం ద్వేషం రంగులురా... 

భోగం భాగ్యం తళుకేరా

కునికే దీపం తొణికే ప్రాణం... 

నిలిచేకాలం తెలియదురా

నిలిచేకాలం తెలియదురా....


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ.... 

ఇది నిలిచేదేమో మూడు రోజులు... 

బంధాలేమో పదివేలు....

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా | Nuvvitta Nenatta | Song Lyrics | Seethamalakshmi (1978)

నువ్విట్ట నేనిట్ట కూకుంటే ఇంకెట్టా చిత్రం :  సీతామాలక్ష్మి (1978) సంగీతం :  కె.వి. మహదేవన్ గీతరచయిత :  వేటూరి నేపధ్య గానం :  బాలు, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు