RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

16, ఏప్రిల్ 2023, ఆదివారం

ఏ తల్లి కన్నదిరో నీటుగాడా | Ye thalli kannadiro | Song Lyrics | Tiger (1979)

ఏ తల్లి కన్నదిరో నీటుగాడా



చిత్రం : టైగర్ (1979)

సంగీతం : సత్యం

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


ఏ తల్లి కన్నదిరో నీటుగాడా

ఏ పిల్లకున్నదిరో నీతో జోడా

నీ నీడవుంటే..హా..మేడకడతా

నువు తోడు ఉంటే..హా..జోడుగుంటా 


ఏ తల్లి కన్నదిరో నీటుగాడా

ఏ పిల్లకున్నదిరో నీతో జోడా

నీ నీడవుంటే... మేడకడతా

నువు తోడు ఉంటే... జోడుగుంటా 


అహా..అహహా..ఒహోహో..

అహువా..అహువా

వహవహ అహవహవహా..ఆ 



చరణం 1 :


ఒంటిగుంటే ఒంటిగుంట...  

కొడుతుందయ్యో

అంటుకుంటె కొంపలంటుకుంటాయ్..

రయ్యో..హ్హా

ఒంటిగుంటే ఒంటిగుంట... 

కొడుతుందయ్యో

అంటుకుంటె కొంపలంటుకుంటాయ్..

రయ్యో 

నా యీడు చూశా... నీతోడు చూశా

నా యీడు చూశా..ఆ..

నీతోడు చూశా..అహా

మల్లెపూల మంచమేసి..

ఎన్నెలంతా పక్కేశా

ఏలా..ఏలా..ఏలకుంటే..

నీకూ నాకూ ఇంతేరోయ్..ఓలబ్బో


ఏ తల్లి కన్నదిరో నీటుగాడా

ఏ పిల్లకున్నదిరో నీతో జోడా

నీ నీడవుంటే... హా హా హా..మేడకడతా

నువు తోడు ఉంటే... జోడుగుంటా  


అహా..అహహా..ఒహోహో..

అహువా..అహువా

వహవహ అహవహవహా..ఆ


చరణం 2 :


నీ ఫోజు చూస్తే 

మోజు నాలో పెరుగుతున్నాది

నువ్వు సైగచేస్తే 

సన్నజాజి తెల్లబోయిందీ

నీ ఫోజు చూస్తే... 

మోజు నాలో పెరుగుతున్నాది

నువ్వు సైగచేస్తే... 

సన్నజాజి తెల్లబోయిందీ  


రాతిరంత చూసా... నా దారి చూశా

రాతిరంత చూసా..ఆ..

నా దారి చూశా..ఆహోయ్

అందమంతా పందిరేసి..

అందకుండ వచ్చేసా

ఏలా..ఏలా..ఏలకుంటే..

నీకూ నాకూ ఇంతేరోయ్


ఏ తల్లి కన్నదిరో నీటుగాడా

ఏ పిల్లకున్నదిరో నీతో జోడా

నీ నీడవుంటే... హా..మేడకడతా

నువు తోడు ఉంటే... జోడుగుంటా..ఆ 


అహా..అహహా..ఒహోహో..

అహువా..అహువా

వహవహ అహవహవహా..ఆ


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు