RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, మార్చి 2023, మంగళవారం

ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం | O Jabilee Vennela Akasam | Song Lyrics | Rangoon Rowdy (1979)

ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం



చిత్రం : రంగూన్ రౌడి (1979)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :   సుశీల



పల్లవి :


ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం

ఎదురు చూసింది నిదుర కాసింది..  

కలువ నీ కోసమే..


వెలుగువై రావోయి... వెలుతురే తేవోయి

ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం 


ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... 

ఝుమ్ ఝుమ్ ఝుమ్



చరణం 1 :


నువ్వు లేక...  నవ్వ లేక... ఎందరున్నా ఎవరు లేక

జంట గాని...  తోడు లేక...  ఒంటిగా నేనుండలేను ..


స్నేహ దీపాలు...

స్నేహ దీపాలు.... వెలగనీ చాలు

చీకటే లేదోయి

వెలుతురే కావోయి... వెలుతురే తేవోయి..


ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం 

ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... 

ఝుమ్ ఝుమ్ ఝుమ్


చరణం 2 :


గువ్వ లాగా నువ్వు రాగా... గూడు నవ్వే గుండె నవ్వే

వేకువల్లె నీవు రాగా... చీకటంతా చెదిరిపోయే


తుడిచి కన్నీళ్లు....

తుడిచి కన్నీళ్లు... కలసి నూరేళ్ళు

జతగా ఉందామోయి

వెలుగువే నీవోయి .... వెలుతురే కావోయి


ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం 

ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... 

ఝుమ్ ఝుమ్ ఝుమ్


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు