RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

11, డిసెంబర్ 2024, బుధవారం

నీ చూపులు గారడి చేసెను | Nee Chupulu Garadi Chesenu | Song Lyrics | Amayakuralu (1971)

నీ చూపులు గారడి చేసెను



చిత్రం: అమాయకురాలు (1971)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


నీ చూపులు గారడి చేసెను.. 

నీ నవ్వులు పూలై పూచెను

ఆ నవ్వులలో.. ఆ చూపులలో.. 

నిను కవ్వించేవాడెవ్వడో..


నా చూపులు గారడి చేసినా.. 

నా నవ్వులు పూలై పూచినా..

ఏ ఒక్కరికో అవి దక్కునులే.. 

ఆ టక్కరి దొంగవు నీవేలే


చరణం 1:


నీ మోమే ఒక చంద్రబింబం.. 

దానికి ముచ్చటైన పుట్టుమచ్చ అందం..

నీ మోమే ఒక చంద్రబింబం..

ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి..

ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి..

ఎందరు యువకులు తొందరపడి 

నిన్నెత్తుకుపోతారో.. నేనేమైపోతానో...


అహ..హ....

నా చూపులు గారడి చేసినా.. 

నా నవ్వులు పూలై పూచినా..

ఏ ఒక్కరికో అవి దక్కునులే.. 

ఆ టక్కరి దొంగవు నీవేలే


చరణం 2:


మగసిరిగల సొగసైన దొరవు.. 

అందుకు సరిపడు సిరులెన్నో కలవు...

మగసిరిగల సొగసైన దొరవు..

నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి

నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి

చక్కని పడుచుల.. 

చెక్కెలి తళుకుల చిక్కుకుపోతావో.. 

నీ చెలినే మరచేవో..


ఊ..హ..హ..

నీ చూపులు గారడి చేసెను.. 

నీ నవ్వులు పూలై పూచెను

ఆ నవ్వులలో ఆ చూపులలో.. 

నిను కవ్వించేవాడెవ్వడో...


చరణం 3:


చిగురించిన ఈ అనురాగం.. 

వికసించునులే కలకాలం

చిగురించిన ఈ అనురాగం..

నీ వలపే నేనై.. నా వెలుగే నీవై

కమ్మని మమతల బంగరు మేడల 

కలలే కందామా..

కలలే కందామా..


ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చక్కని చుక్క సరసకు రావే | Chakkani Chukka | Song Lyrics | Iddaru Mitrulu (1961)

చక్కని చుక్క సరసకు రావే చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: ఆరుద్ర నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు