RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

26, మే 2023, శుక్రవారం

ఆగదు ఏ నిముషము | Agadu ye nimushamu | Song Lyrics | Premabhishekam (1981)

ఆగదు ఏ నిముషము



చిత్రం :  ప్రేమాభిషేకం (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : దాసరి

నేపధ్య గానం : బాలు


పల్లవి :


ఆగదు ఆగదు... ఆగదు 


ఆగదు ఏ నిముషము నీ కోసము

ఆగితే సాగదు ఈ లోకము

ఆగదు ఏ నిముషము నీ కోసము

ఆగితే సాగదు ఈ లోకము... 

ముుందుకు సాగదు ఈ లోకము 


ఆగదు ఆగదు... ఆగితే సాగదు



చరణం 1 :


జాబిలి చల్లననీ... వెన్నెల దీపమనీ

తెలిసినా గ్రహణమూ రాక ఆగదు

పువ్వులు లలితమని...  తాకితే రాలునని

తెలిసినా పెనుగాలి రాక ఆగదు


హృదయుం అద్దమనీ... పగిలితే అతకదనీ

తెలిసినా...  మృత్యువూ రాక ఆగదు

మృత్యువూ...  రాక ఆగదు


ఆగదు ఏ నిముషము నీ కోసము

ఆగితే సాగదు ఈ లోకము... 

ముుందుకు సాగదు ఈ లోకము



చరణం 2 :


జీవితమొక పయనమనీ... గమ్యం తెలియదనీ

తెలిసినా ఈ మనిషి...  పయనమాగదు

జననం ధర్మమని...  మరణం కర్మమనీ

తెలిసినా జనన మరణ చక్రమాగదు


మరణం తధ్యమనీ...  ఏ జీవికి తప్పదనీ

తెలిసినా...  ఈ మనిషి తపన ఆగదు

ఈ బ్రతుకు తపన ఆగదు


ఆగదు ఏ నిముషము నీ కోసము

ఆగితే సాగదు ఈ లోకము... 

ముుందుకు సాగదు ఈ లోకము

ఆగదు ఆగదు... ఆగితే సాగదు




చరణం 3 :




మనసు మనసు కలయికలో

ఉదయిుంచక ఆగదు...  అనురాగం


అనురాగపు అర్పణలో... 

చెలియిుంచక మానదు త్యాగం

ప్రేమ చెరిగినా మనసు చెదిరినా... 

ఆగదు త్యాగాభిషేకం

గెలుపు ఓడినా ఓటమి గెలిచినా... 

ఆగదు ప్రేమాభిషేకం

ఆగదు ప్రేమాభిషేకం....


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

కౌగిలిలో ఉయ్యాలా | Kougililo Vuyyala | Song Lyrics | Annadammula Anubandham (1975)

కౌగిలిలో ఉయ్యాలా కన్నులలో జంపాలా  చిత్రం :  అన్నదమ్ముల అనుబంధం (1975) సంగీతం :  చక్రవర్తి గీతరచయిత :  దాశరథి నేపధ్య గానం :  బాలు, జానకి  పల్...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు