అందాలు కనువిందు చేస్తుంటే
చిత్రం : కన్నవారి కలలు (1974)
సంగీతం : వి. కుమార్
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : రామకృష్ణ
పల్లవి :
అందాలు కనువిందు చేస్తుంటే..
ఈ అందాలు కనువిందు చేస్తుంటే..
ఎదలోన పులకింత రాదా..
చూసే కనులకు నోరుంటే.. మధురగీతమే పాడదా..
మధురగీతమే పాడదా
అందాలు కనువిందు చేస్తుంటే..
ఎదలోన పులకింత రాదా
చరణం 1 :
చల్లగాలుల పల్లకీలలో నల్ల మబ్బులూరేగెనూ..
అంబరాన ఆ సంబరాలుగని గిరులబారులు మురిసెనూ
పలుకు రాని ప్రకృతి నాకు పలికె స్వాగతాలు..
నిండుగా కలలు పండగా.. నాదు డెందమే నిండగా
అందాలు కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా
చరణం 2 :
ఎవరి కురులలో నలుపు చూసి తుమ్మెదలు చిన్నబోయెనూ
ఎవరి బుగ్గల ఎరుపు చూసి చెంగలువ సిగ్గు చెందేనూ
అవే సోయెగాల కురులూ.. అవే మిసిమి బుగ్గలూ
చిలిపిగ మనసు చెదరగా.. కనుల కెదురుగా వెలిసెనూ
అందాలు కనువిందు చేస్తుంటే.. ఎదలోన పులకింత రాదా
చరణం 3 :
ఈ సరస్సులో ఇంద్ర ధనుస్సులో..
వింత సొగసు ఏముంది
ఓర చూపుల సోగకనులలో కోటి సొగసుల గని వుంది
చెలియ పాలనవ్వులోన మరులు జల్లు వాన కురిసెనే ..
వలపు విరిసెనే.. తలపు చిందులే వేసెనే
అందాలు కనువిందు చేస్తుంటే..
ఎదలోన పులకింత రాదా
చూసే కనులకు నోరుంటే..మధురగీతమే పాడదా...
మధురగీతమే పాడదా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి