RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
sirisampadalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sirisampadalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఏప్రిల్ 2026, శనివారం

ఈ పగలు రేయిగా | Ee Pagalu Reyiga | Song Lyrics | Siri Sampadalu (1962)

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ 


చిత్రం : సిరి సంపదలు (1962)

సంగీతం : మాస్టర్ వేణు

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, జానకి 


పల్లవి :


ఈ పగలు రేయిగా.. 

పండు వెన్నెలగ మారినదేమి చెలీ

ఆ కారణమేమి చెలీ...  ఆ... ఊఁ..

వింతకాదు నా చెంతనున్నది

వెండి వెన్నెల జాబిలి

నిండు పున్నమి జాబిలి... ఓ... ఓ... ఓ... 


చరణం 1 :


మనసున తొణికే చిరునవ్వెందుకు...

పెదవుల మీదికి రానీవు?

అహా... ఓహో... అహా... ఆ... ఆ...

మనసున తొణికే చిరునవ్వెందుకు... 

పెదవుల మీదికి రానీవు?

పెదవి కదిపితే మదిలో మెదిలే మాట 

తెలియునని మానేవు.. ఊఁ.... 

  

వెండి వెన్నెల జాబిలి ... 

నిండు పున్నమి జాబిలి... 

ఆ... ఆ...ఆ... ఆ... ఓ... ఓ... ఓ...


చరణం 2 :


కన్నులు తెలిపే కథలనెందుకు.. 

రెప్పలార్చి ఏమార్చేవు?

ఆఁ... ఆఁ... ఓ.. ఓ... ఓ...

కన్నులు తెలిపే కథలనెందుకు.. 

రెప్పలార్చి ఏమార్చేవు?

చెంపలు పూచే కెంపులు నాతో 

నిజము తెలుపునని జడిసేవు

ఓహోహో...


వెండి వెన్నెల జాబిలి ... 

నిండు పున్నమి జాబిలి... 


చరణం 3 :


అలుక చూపి అటువైపు తిరిగితే.. 

అగుపడదనుకుని నవ్వేవు

ఉహుహు..

అలుక చూపి అటువైపు తిరిగితే.. 

అగుపడదనుకుని నవ్వేవు

నల్లని జడలో మల్లెపూలు 

నీ నవ్వునకద్దము చూపేను.. ఆహా...


వెండివెన్నెల జాబిలి.. 

నిండు పున్నమి జాబిలి..

ఆహహాహా... ఆహహాహా...

ఆహహాహా... ఆహహాహా...

ఊహుహూ...


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు