RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
apada mokkulavada o srinivasa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
apada mokkulavada o srinivasa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2026, శనివారం

ఆపద మొక్కుల వాడా ఓ శ్రీనివాసా | Apada Mokkulavada O Srinivasa | Song Lyrics | Nindu Manasulu (1967)

ఆపద మొక్కుల వాడా ఓ శ్రీనివాసా


ఆపదమొక్కులవాడ ఓ శ్రీనివాస 

చిత్రం :  నిండు మనసులు  (1967)

సంగీతం :  టి వి రాజు 

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపథ్య గానం :  పి సుశీల,


పల్లవి : 


ఆపద మొక్కుల వాడా 

ఓ శ్రీనివాసా

అడుగడుగున కాపాడే 

తిరుమల గిరివాసా

శ్రీనివాసా - శ్రీనివాసా


చరణం 1: 


జనులందరు 

నీ చల్లని కనుపాపలే

జగమంతా వెల్లివిరిసె  

నీచూపులే

నిను నమ్మిన దీనుల 

కన్నీటి పిలుపు వినక 

కొండపై  నిండుగా 

కొలువై వున్నావా 


చరణం 2 : 


నిండు మనసు గలవారికి  

నిందలు మిగిలేనా

మంచిని కోరే బ్రతుకే  

మంటలపాలేనా

వెలుగు చిలికే దీపం 

విలవిలలాడేనా

దేవా దేవా నీకిది న్యాయమా


చరణం 3 : 


గుండెనిండా వెతలు దాచి 

కుమిలిపోతిగాని

కొంగుసాచి ఎన్నడేమి 

కోరలేదు స్వామి

అతని ప్రాణములను 

నిలపి ఆదుకోవయ్యా

అందుకు నా ప్రాణములే 

అర్పించుదునయ్యా

శ్రీనివాసా -

శ్రీనివాసా -

శ్రీనివాసా -


-  పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు