RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

7, ఆగస్టు 2023, సోమవారం

ఇది మైకమా బింకమా | Idi Maikama Binkama | Song Lyrics | Indhradhanussu (1978)

ఇది మైకమా బింకమా



చిత్రం: ఇంద్ర ధనుస్సు (1978)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..

ఇదే ఇదే నీకు అందమా..

ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..

ఇదే ఇదే నీకు అందమా...


ఇది స్వప్నమా...ఆ..సత్యమా...

ఇదే ఇదే పూర్వపుణ్యమా...

ఇది స్వప్నమా...ఆ..సత్యమా...

ఇదే ఇదే పూర్వపుణ్యమా...


చరణం 1:


పూలదండకే ఇంత పులకరింతా...

చల్లగాలికే ఇంత జలదరింతా...

పూలదండకే ఇంత పులకరింతా...

చల్లగాలికే ఇంత జలదరింతా...


కళ్ళు తెరుచుకున్నా...కలవరింతా...

కళ్ళు తెరుచుకున్నా...కలవరింతా...

కలలు రాకపోయినా పలవరింత...


ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..

ఇదే ఇదే నీకు అందమా...

ఇది స్వప్నమా...ఆ..సత్యమా...

ఇదే ఇదే పూర్వపుణ్యమా...


చరణం 2:


పరిచింది నీ నవ్వు పాలపుంత...

పాకింది బుగ్గలలో జేవురింతా...

పరిచింది నీ నవ్వు పాలపుంత...

పాకింది బుగ్గలలో జేవురింతా...ఆ..


కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా..ఆ...

కాచుకుంది ఒంటరిగా కౌగిలింతా..ఆ...

కానుక ఇస్తుంది కన్నెవయసునంతా...


ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..

ఇదే ఇదే నీకు అందమా...

ఇది స్వప్నమా...ఆ..సత్యమా...

ఇదే ఇదే పూర్వపుణ్యమా...


చరణం 3:


నా చూపే వస్తుంది నీ వెంట...

నీ రూపే ఉంటుంది నా చెంత...

నా చూపే వస్తుంది నీ వెంట...

నీ రూపే ఉంటుంది నా చెంత...


నీతోనే నిండింది హృదయమంతా...ఆ..

నీతోనే నిండింది హృదయమంతా...

నాతోడై ఉండాలి కాలమంతా....


ఇది మైకమా..ఆ..ఆ..బింకమా..

ఇదే ఇదే నీకు అందమా...

ఇది స్వప్నమా...ఆ..సత్యమా...

ఇదే ఇదే పూర్వపుణ్యమా...


పాటల ధనుస్సు  




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే | Brahmamokkate Parabrahmamokkate | Annamacharya Keerthana | Annamayya (1997)

 బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య సంకీర్తనలు  గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు