RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
nee chupulu garadi chesenu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
nee chupulu garadi chesenu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, డిసెంబర్ 2024, బుధవారం

నీ చూపులు గారడి చేసెను | Nee Chupulu Garadi Chesenu | Song Lyrics | Amayakuralu (1971)

నీ చూపులు గారడి చేసెను



చిత్రం: అమాయకురాలు (1971)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


నీ చూపులు గారడి చేసెను.. 

నీ నవ్వులు పూలై పూచెను

ఆ నవ్వులలో.. ఆ చూపులలో.. 

నిను కవ్వించేవాడెవ్వడో..


నా చూపులు గారడి చేసినా.. 

నా నవ్వులు పూలై పూచినా..

ఏ ఒక్కరికో అవి దక్కునులే.. 

ఆ టక్కరి దొంగవు నీవేలే


చరణం 1:


నీ మోమే ఒక చంద్రబింబం.. 

దానికి ముచ్చటైన పుట్టుమచ్చ అందం..

నీ మోమే ఒక చంద్రబింబం..

ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి..

ఆ అందం చూసి.. నీ ముందుకు దూకి..

ఎందరు యువకులు తొందరపడి 

నిన్నెత్తుకుపోతారో.. నేనేమైపోతానో...


అహ..హ....

నా చూపులు గారడి చేసినా.. 

నా నవ్వులు పూలై పూచినా..

ఏ ఒక్కరికో అవి దక్కునులే.. 

ఆ టక్కరి దొంగవు నీవేలే


చరణం 2:


మగసిరిగల సొగసైన దొరవు.. 

అందుకు సరిపడు సిరులెన్నో కలవు...

మగసిరిగల సొగసైన దొరవు..

నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి

నీ పక్కన మూగి.. తమ మక్కువ చూపి

చక్కని పడుచుల.. 

చెక్కెలి తళుకుల చిక్కుకుపోతావో.. 

నీ చెలినే మరచేవో..


ఊ..హ..హ..

నీ చూపులు గారడి చేసెను.. 

నీ నవ్వులు పూలై పూచెను

ఆ నవ్వులలో ఆ చూపులలో.. 

నిను కవ్వించేవాడెవ్వడో...


చరణం 3:


చిగురించిన ఈ అనురాగం.. 

వికసించునులే కలకాలం

చిగురించిన ఈ అనురాగం..

నీ వలపే నేనై.. నా వెలుగే నీవై

కమ్మని మమతల బంగరు మేడల 

కలలే కందామా..

కలలే కందామా..


ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా.. ఆహాహహా..


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వాగతం మా బంగారు తల్లి స్వాగతం | Swagatham Maa Bangaru Thalli | Song Lyrics | RK Duvvu | RKSS Creations

  ఈశా ఆహ్వానం పాట స్వాగతం .. మా బంగారు తల్లి స్వాగతం రచన : రామకృష్ణ దువ్వు   సాకి: అరుణ బింబము అరుదెంచెను ధరిత్రిన తిమిరాన్ని తరిమ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు