RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kondisetti sri ramarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kondisetti sri ramarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, ఏప్రిల్ 2026, శుక్రవారం

నీలాల నింగిలోన పగడాల పందిరి | Neelala Ningilona | Song Lyrics | Daana Dharmalu (1976)

నీలాల నింగిలోన పగడాల పందిరి


చిత్రం : దానధర్మాలు (1976)

సంగీతం : మాస్టర్ వేణు

గీతరచయిత : కొండిశెట్టి శ్రీ రామా రావ్ 

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల 

 

పల్లవి :


నీలాల నింగిలోన 

పగడాల పందిరి వేసి

రతనాల రంగులతో.. 

ముత్యాల ముగ్గులు వేద్దామా

ముత్యాల ముగ్గులు వేద్దామా... 


చరణం 1 :


పుష్పరాగములతో.. 

పొదిగిన పచ్చలతో..

పుష్పరాగములతో.. 

పొదిగిన పచ్చలతో..

కెంపులతో సొంపుగనూ

వజ్రాల వంపులు తీర్చిన.. 

ఆ వయ్యారి భామవు నీవే.. 

వరసైన చినదాన  


వరసైనదానిని కాను.. 

ఆ సిసలైన దానిని నేను

సిగ్గు తెర తీసి చెప్పాను నేను 

చేసుకుంటాను నిన్నేననీ

ఒప్పుకుంటే కదా నిన్ను నేను... 

చేశారు ఈ పెళ్ళి మనకు

మూడుముళ్ళు విప్పిన కూడా 

పోలేవు ముందుకు నీవు...

పోలేవు ముందుకు నీవు... 


చరణం 2 :


మనసైన మగువతో 

మాటాడకుండ లేను...

మనసైన మగువతో 

మాటాడకుండ లేను...

నిన్ను విడిచి నిముషమైన 

నిలువలేను ఈ జగాన

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

ప్రేమగ చూస్తే చాలు 

నీ పాద పూజ చేస్తాను

జన్మజన్మలకైనా 

నిన్నే కోరుకుంటాను... 

నిన్నే కోరుకుంటాను... 


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు