RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
Adarsha Kutumbam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Adarsha Kutumbam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఫిబ్రవరి 2026, సోమవారం

బిడియమేలా ఓ చెలి | Bidiyamela O Cheli | Song Lyrics | Adarsha Kutumbam (1969)

బిడియమేలా ఓ చెలి


చిత్రం: ఆదర్శ కుటుంబం (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత:   సి.నారాయణరెడ్డి    

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


బిడియమేలా.. ఓ చెలి..

పిలిచె నిన్నే.. కౌగిలి..

మొదటిరేయి ఒదిగిపోయి

మోము దాచేవెందుకో.. ఎందుకో


హా.. అదే ఎందుకో

బిడియమేలా... ఓ చెలి

పిలిచె నిన్నే.. కౌగిలి

మొదటి రేయి ఒదిగిపోయి

మోము దాచేవెందుకో... ఎందుకో


చరణం 1:


కనులు ముకుళించెను.. లోలోన

తనువు వికసించెను.. పైపైన

కనులు ముకుళించెను.. లోలోన

తనువు వికసించెను.. పైపైన


పదము రాక.. కదలలేక

ఒదిగి ఉన్నాను ఈ వేళ

ఒదిగి ఉన్నాను ఈ వేళ

నిలువలేను... పిలువలేను

ఊ...ఊ..


బిడియమేలా... ఓ చెలి

పిలిచె నిన్నే.. కౌగిలి

మొదటి రేయి ఒదిగిపోయి

మోము దాచేవెందుకో... ఎందుకో


చరణం 2:


శయ్యపై మల్లియలేమనెను

చాటుగ జాబిలి ఏమనెను

శయ్యపై మల్లియలేమనెను

చాటుగ జాబిలి ఏమనెను


కలల దారి చెలుని చేరి

కరిగిపొవేమి నీవనెను

కరిగి పొవేమి నీవనెను

మరులు పూచే... మనసు వీచే

ఊ...ఊ..


బిడియమేలా... ఓ చెలి

పిలిచె నిన్నే.. కౌగిలి

మొదటి రేయి ఒదిగిపోయి

మోము దాచేవెందుకో... ఎందుకో


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

గువ్వలాంటి చిన్నది | Guvvalanti Chinnadi | Song Lyrics | Lakshmi Nivasam (1968)

గువ్వలాంటి చిన్నది  చిత్రం: లక్ష్మీ నివాసం (1968) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల పల్లవి: గువ్వలాంటి చిన్నది  తారా జు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు