RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

30, జూన్ 2024, ఆదివారం

ఎవరో ఎవరో నీ వాడు | Evaro Evaro Neevadu | Song Lyrics | Tene Manasulu (1965)

ఎవరో ఎవరో నీ వాడు



చిత్రం :  తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : సుశీల 


పల్లవి:


తెల్లని వన్నెదానా... 

విరి తేనియలూరు మనస్సు దానా

నీ వెళ్ళిన దారిలోన విను వీధిని.. 

భూమిని.. సాగరానా

నా వల్లభుదెచ్చటైన కానవచ్చెనే? 

వేదన తీర నీకు యే చల్లని మాట చెప్పమనే? 

చప్పున చెప్పవె రాజ హంసమా...  


ఆది పురాణ యుగము దమయంతి 

నాడు భాషలన్నియు తెలిసినవారు వారు 

నేను నీ భాష తెలియనిదాన గాన 

మనిషి భాషలో మావారి మాట చెపుమ


ఎవరో ఎవరో నీ వాడు... 

ఎరుగను ఎరుగను నీ తోడు 

ఎవరో ఎవరో నీ వాడు... 

ఎరుగను ఎరుగను నీ తోడు

ఎవరో ఎవరో నీ వాడు... 

ఎరుగను ఎరుగను నీ తోడు


చరణం 1 :


చుక్కల వీధిన వస్తుంటే... 

తారల ఊసులు విన్నానే 

చుక్కల వీధిన వస్తుంటే... 

తారల ఊసులు విన్నానే 

కలువుల కన్నులు గలవాడు...  

చలువుల మనసే గలవాడు 

వెన్నెల నవ్వుల వెలెగేవాడు... 

వస్తున్నాడని అన్నారే ? 


వాడే నీవాడా ? వాడే నీవాడా ? 

వాడే నీవాడా ? వాడే నీవాడా ? ... 

ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


ఎవరో ఎవరో నీ వాడు... 

ఎరుగను ఎరుగను నీ తోడు


చరణం 2 :


నీటి బాటలో వస్తుంటే... 

నదీ కన్యల నాట్యం చూశా 

నీటి బాటలో వస్తుంటే... 

నదీ కన్యల నాట్యం చూశా 

పొంగే బంగరు ప్రాయం వాడూ... 

అలలె హారంగా కలవాడు 

అంతు దొరకనీ హృదయం వాడు... 

వస్తున్నాడని అన్నారే ? 


వాడే నీవాడా ? వాడే నీవాడా ? 

వాడే నీవాడా ? వాడే నీవాడా ?.. 

ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

ఎవరో ఎవరో నీ వాడు... 

ఎరుగను ఎరుగను నీ తోడు


చరణం 3:


పూలవాడలో వస్తుంటే...  

మల్లె జాజి మందారం 

పూలవాడలో వస్తుంటే...  

మల్లె జాజి మందారం

నే ముందుంటే... నే ముందుంటూ... 

తగవులాడగా విన్నానే 

తేనెలు దోచే తీయని వాడు... 

వస్తున్నాడని అన్నారే ?  


వాడే నీవాడా ? వాడే నీవాడా ? 

వాడే నీవాడా ? వాడే నీవాడా ? ...

ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


ఎవరో ఎవరో నీ వాడు... 

ఎరుగను ఎరుగను నీ తోడు 

ఎవరో ఎవరో నీ వాడు... 

ఎరుగను ఎరుగను నీ తోడు


- పాటల ధనుస్సు 


పురుషుడు నేనై పుట్టాలి | Purushudu Nenai Puttali | Song Lyrics | Tene Manasulu (1965)

పురుషుడు నేనై పుట్టాలి

 


చిత్రం :  తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : సుశీల, ఘంటసాల, పి. బి. శ్రీనివాస్


పల్లవి :


పురుషుడు నేనై పుట్టాలి... 

ప్రకృతి నీవే రావాలి

ఇరువురి మనసులు కలవాలి...

ఆ కలయిక కళకళలాడాలి


పురుషుడు నేనై పుట్టాలి... 

ప్రకృతి నీవే రావాలి

ఇరువురి మనసులు కలవాలి...

ఆ కలయిక కళకళలాడాలి


పుడమే నేనై పుట్టాలి... 

ఒడిదుడుకులను ఓర్వాలి

పుడమే నేనై పుట్టాలి... 

ఒడిదుడుకులను ఓర్వాలి


కడలిని నదినీ కలపాలి... 

ఆ కలయిక కళకళలాడాలి


పుడమే నేనై పుట్టాలి... 

ఒడిదుడుకులను ఓర్వాలి

కడలిని నదినీ కలపాలి... 

ఆ కలయిక కళకళలాడాలి


చరణం 1 :


మెరమెరలాడే వయసు నేనై... 

మిసమిసలాడే సొగసు నీవై

మెరమెరలాడే వయసు నేనై... 

మిసమిసలాడే సొగసు నీవై


వెల్లువలాగా వెన్నెలలాగా... 

ముల్లోకాలను ముంచాలి

వెల్లువలాగా వెన్నెలలాగా... 

ముల్లోకాలను ముంచాలి


పుడమే నేనై పుట్టాలి... 

ఒడిదుడుకులను ఓర్వాలి

కడలిని నదినీ కలపాలి... 

ఆ కలయిక కళకళలాడాలి


చరణం 2 :


పైమెరుగులకే ఉరకలువేసే... 

పరువానికి పగ్గం వేసి

పైమెరుగులకే ఉరకలువేసే... 

పరువానికి పగ్గం వేసి

పగ్గం కట్టిన కన్నె మనసులో... 

లోతులు తెలిసి మసలాలి

పగ్గం కట్టిన కన్నె మనసులో... 

లోతులు తెలిసి మసలాలి


పురుషుడు నేనై పుట్టాలి... 

ప్రకృతి నీవే రావాలి

కడలిని నదినీ కలపాలి... 

ఆ కలయిక కళకళలాడాలి


దేవుడు నేనై పుట్టాలి... 

దేన్నో తాన్నో ప్రేమించి 

దేవుడు నేనై పుట్టాలి... 

దేన్నో తాన్నో ప్రేమించి


ఆడదాని మనసంటేనే... 

విషమని తెలిసి ఏడ్వాలి


దేవుడు నేనై పుట్టాలి... 

దేన్నో తాన్నో ప్రేమించి


ఆడదాని మనసంటేనే... 

విషమని తెలిసి ఏడ్వాలి


చరణం 3 :


గాజు వంటి హృదయం తనది... 

రాతి వంటి నాతికి తగిలి

గాజు వంటి హృదయం తనది... 

రాతి వంటి నాతికి తగిలి

ముక్కలు చెక్కలుగా పగిలి... 

నెత్తురు కన్నీరవ్వాలి

ముక్కలు చెక్కలుగా పగిలి... 

నెత్తురు కన్నీరవ్వాలి


దేవుడు నేనై పుట్టాలి... 

దేన్నో తాను  ప్రేమించి

ఆడదాని మనసంటేనే... 

విషమని తెలిసి ఏడ్వాలి

విషమని తెలిసి ఏడ్వాలి


- పాటల ధనుస్సు 


29, జూన్ 2024, శనివారం

మాస్టారూ డ్రిల్ మాస్టారూ | Mastaru Drill Mastaru | Song Lyrics | Tene Manasulu (1965)

మాస్టారూ... డ్రిల్ మాస్టారూ



చిత్రం : తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 


పల్లవి :


ఒన్ టూ త్రీ ఫోర్...

ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్

మాస్టారూ... డ్రిల్ మాస్టారూ


ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ 

ఫోర్ త్రీ టూ ఒన్

మానేస్తారా... ఇక మానేస్తారా

ఉద్యోగం ఇస్తాము చేస్తారా 

ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా


ఒన్ టూ త్రీ ఫోర్...

ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్

మాస్టారూ... డ్రిల్ మాస్టారూ

ఉద్యోగం ఇస్తాము చేస్తారా 

ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా


మాస్టారూ... డ్రిల్ మాస్టారూ


చరణం 1 :


ఒళ్ళు వంచి పని చేయాలి... 

మెదడుకు పదును పెట్టాలి

ఒళ్ళు వంచి పని చేయాలి... 

మెదడుకు పదును పెట్టాలి


అమ్మయ్యే మెదడే... 

అది లేకున్నా పరవలేదు... 

మీకు తోడుడై నేనే ఉంటాను


అమ్మయ్యా ఉంటారా

మెలుకువగా పని చేశారంటే... 

మీరే దొరలైపోతారు  


ఒన్ టూ త్రీ ఫోర్...

ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్

మాస్టారూ... డ్రిల్ మాస్టారూ

ఉద్యోగం ఇస్తాము చేస్తారా 

ఒక ఉద్యోగం ఇస్తాము చేస్తారా

మాస్టారూ... డ్రిల్ మాస్టారూ


చరణం 2 :


మరి జీతం?

నెలకు ముప్పై రోజులు జీతం... 

రోజుకు రెండే పూటలు భత్యం..

నెలకు ముప్పై రోజులు జీతం... 

రోజుకు రెండే పూటలు భత్యం... 

చిత్తం


పూటపూటకు పని ఉంటుంది... 

నాలుగు రోజులు సెలవుంటుంది

సెలవుల్లో ఏం చేయాలి

మా కొలువుననే మీరుండాలి

మా కనుసన్నలలో మెలగాలి

దానికి జీతం...  

నా జీవితం


- పాటల ధనుస్సు 


28, జూన్ 2024, శుక్రవారం

ఏం ఎందుకని ఈ సిగ్గెందుకని | Em Endukani | Song Lyrics | Tene Manasulu (1965)

ఏం... ఎందుకని .. ఈ సిగ్గెందుకని



చిత్రం : తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 


పల్లవి :


ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని


ఆలుమగల మధ్యనున్నది 

ఎవరికి తెలియదని


ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని


ఆలుమగల మధ్యనున్నది 

ఎవరికి తెలియదని


చరణం 1 :


దీపముంటే సిగ్గంటివి... 

చీకటైనా సిగ్గెందుకు


దీపముంటే సిగ్గంటివి... 

చీకటైనా సిగ్గెందుకు


మొగ్గ విరిసే తీరాలి... 

సిగ్గు విడిచే పోవాలి 

ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని


ఆలుమగల మధ్యనున్నది 

ఎవరికి తెలియదని


చరణం 2 :


ఆ గదిలో నీ హృదిలో... 

కౌగిలిలో ఈ బిగిలో


ఆ గదిలో నీ హృదిలో... 

కౌగిలిలో ఈ బిగిలో


ఎలా ఉందో ఏమౌతుందో... 

ఏం చేయాలని నీకుందో... చెప్పు

ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని


ఆలుమగల మధ్యనున్నది 

ఎవరికి తెలియదని


చరణం 3 :


ఊహు! పక్కన చేరాడా చేరి... 

చెక్కిలి నొక్కాడా


చెల్లీ పక్కన చేరాడా చేరి... 

చెక్కిలి నొక్కాడా


ఇక్కడనా? చెక్కిలినా?... 

ఏమిటిదీ గిల్లినదా... 


ఇక్కడనా? చెక్కిలినా?... 

ఏమిటిదీ గిల్లినదా... 


పంటికి గోటికి తేడా లేదా


ఎందుకులే... ఎందుకులే... 

ఈ బుకాయింపులు

ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని


ఆలుమగల మధ్యనున్నది 

ఎవరికి తెలియదని


చరణం 4 :


పగటి వేషం నాదమ్మా... 

రాత్రి నాటకం నీదమ్మా


పగటి వేషం నాదమ్మా... 

రాత్రి నాటకం నీదమ్మా

అందుకని...  అందుకని


నువు చేసినదంతా చెప్పాలి... 


నువు చేసినదంతా చెప్పాలి... 

నే చెప్పినట్లు నువు చేయాలి


ఏం... ఎందుకని... ఈ సిగ్గెందుకని

ఆలుమగల మధ్యనున్నది 

ఎవరికి తెలియదని


- పాటల ధనుస్సు 


27, జూన్ 2024, గురువారం

అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే | Anadiga Jarugutunna | Song Lyrics | Tene Manasulu (1965)

అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే



చిత్రం : తేనె మనసులు (1965)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : సుశీల 


పల్లవి :


అనాదిగా జరుగుతున్న 

అన్యాయం ఇదిలే

అదేమిటో... 

ఆడదంటే మగవాడికి అలుసులే

అనాదిగా జరుగుతున్న 

అన్యాయం ఇదిలే

అదేమిటో... 

ఆడదంటే మగవాడికి అలుసులే

అనాదిగా జరుగుతున్న 

అన్యాయం ఇదిలే


చరణం 1 :


ఎవడో ఒకడన్నాడని... 

అదియే ప్రజావాక్యమని

ఎవడో ఒకడన్నాడని... 

అదియే ప్రజావాక్యమని

అగ్ని వంటి అర్థాంగిని 

అడవి కంపె రాముడు... 

అగ్ని వంటి అర్థాంగిని 

అడవి కంపె రాముడు... 

శ్రీరాముడు

అనాదిగా జరుగుతున్న 

అన్యాయం ఇదిలే


చరణం 2 :


జూదమాడి ఒక రాజు 

ఆలి నోడినాడు 

జూదమాడి ఒక రాజు 

ఆలి నోడినాడు 

సత్యం సత్యమని ఒక మగడు 

సతిని అమ్మినాడు 

సత్యం సత్యమని ఒక మగడు 

సతిని అమ్మినాడు


అదేమిటో ఆడదంటె 

మగవాడికి అలుసులే

అనాదిగా జరుగుతున్న 

అన్యాయం ఇదిలే

అదేమిటో... 


చరణం 3 :


కాలం మారిందని అన్నారు... 

సంఘం మారిందన్నారు

మారలేదు మారలేదు 

మగవారి మనసులు

ఈ మనసు లేని చేష్టలు


అనాదిగా జరుగుతున్న 

అన్యాయం ఇదిలే

అదేమిటో... 

ఆడదంటే మగవాడికి అలుసులే

అనాదిగా జరుగుతున్న 

అన్యాయం ఇదిలే


- పాటల ధనుస్సు 


23, జూన్ 2024, ఆదివారం

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు | Kurraloy Kurrallu | Song Lyrics | Andamaina Anubhavam (1979)

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు



చిత్రం: అందమైన అనుభవం (1979)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు


పల్లవి:


కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు 

వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు 

వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు


ఆటగాళ్ళు పాటగాళ్ళు 

అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు 

ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ


కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు 

వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు


చరణం 1:


గతమున పూడ్చేది వీళ్ళు 

చరితను మార్చేది వీళ్ళు

కథలై నిలిచేది వీళ్ళు 

కళలకు పందిళ్ళు వీళ్లు

వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు 

చెలిమికెపుడూ జతగాళ్ళు

చెడుపుకెపుడు పగవాళ్ళు 

వీళ్ళ వయసు నూరేళ్ళు 

నూరేళ్ళకు కుర్రాళ్లు

ఆటగాళ్ళు పాటగాళ్ళు 

అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు 

ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..


కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు 

వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు


చరణం 2:


తళతళ మెరిసేటి కళ్ళు 

నిగనిగలాడేటి వొళ్ళు

విసిరే చిరునవ్వు జల్లు 

ఎదలో నాటెను ముల్లు

తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు

నిదురరాని పొదరిల్లు 

బ్రహ్మచారి పడకిల్లు

మూసివున్న వాకిళ్ళు 

తెరచినపుడే తిరునాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు 

అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు 

ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..


చరణం 3:


నీతులుచెప్పే ముసలాళ్ళు 

నిన్న మొన్నటి కుర్రాళ్లు

దులిపెయ్ ఆనాటి బూజులు 

మనవే ముందున్న రోజులు

తెంచేసెయ్ పాతసంకెళ్ళు 

మనషులె మన నేస్తాలు

Come on clap.. 

మనసులె మన కోవెళ్ళు ఎవెర్య్బొద్య్

మనషులె మన నేస్తాలు 

మనసులె మన కోవెళ్ళు

మనకు మనమె దేవుళ్ళు 

మార్చిరాయి శాస్త్రాలు

ఆటగాళ్ళు పాటగాళ్ళు 

అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు 

ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..


కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు 

వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు 

Come on everybody join together


- పాటల ధనుస్సు 

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ | Nuvve Nuvvamma Navvula Puvvamma | Song Lyrics | Andamaina Anubhavam (1979)

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ



చిత్రం: అందమైన అనుభవం (1979)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, వాణీ జయరాం


పల్లవి:


నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ 

నీ సరి ఎవరమ్మ

దినమొక రకము గడసరితనము

దినమొక రకము గడసరితనము

నీలో కలవమ్మ నీవొక కళవమ్మ

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ


నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య 

నీసరి ఎవరయ్య

దినమొక రకము గడసరితనము

దినమొక రకము గడసరితనము

నీకై కలవయ్య నా కళ నీవయ్య

నీకై కలవయ్య నా కళ నీవయ్య


చరణం 1:


ఒకే రోజు దినదినమూ 

ఒక గమకం ఒక మధురం

ఒకే రోజు దినదినమూ 

ఒక గమకం ఒక మధురం

ఒక మేఘం క్షణ క్షణమూ 

ఒక రూపం ఒక శిల్పం

ఆ సరిగమలు ఆ మధురిమలు

నీకై కలవయ్య నా కళ నీవయ్య

నీకై కలవయ్య నా కళ నీవయ్య


చరణం 2:


ఒకే వెన్నెల జత జతకూ 

ఒక సౌరు ఒక పోరు

ఒకే వెన్నెల జత జతకూ 

ఒక సౌరు ఒక పోరు

ఒక కౌగిలి ప్రతి రేయి 

ఒక స్వర్గం ఒక దుర్గం

ఆ జివజివలు ఆ మెలుకువలు

నీలో కలవమ్మ నీవొక కళవమ్మ

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ


నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య 

నీసరి ఎవరయ్య

దినమొక రకము గడసరితనము

నీలో కలవమ్మ నీవొక కళవమ్మ

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ


చరణం 3:


ప్రతి ఋతువు ఈ ప్రకృతికి 

ఒక వింత పులకింత

ప్రతి ఋతువు ఈ ప్రకృతికి 

ఒక వింత పులకింత

మనసుంటే మనకోసం 

ప్రతి మాసం మధుమాసం

ఋతువుల సొగసు చిగురుల వయసు

నీకై కలవయ్య నా కళ నీవయ్య

నీకై కలవయ్య నా కళ నీవయ్య


నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు

నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు

మమతలతో మనసల్లిన 

హరివిల్లే మన ఇల్లు

వలపుల జల్లులు పలుపలు వన్నెలు

నీలో కలవమ్మ నీవొక కళవమ్మ

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ


నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య 

నీసరి ఎవరయ్య

దినమొక రకము గడసరితనము

దినమొక రకము గడసరితనము....


- పాటల ధనుస్సు 

శంభో శివ శంభో | Shambho Siva Sambho | Song Lyrics | Andamaina Anubhavam (1979)

శంభో శివ శంభో



చిత్రం: అందమైన అనుభవం (1979)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు


పల్లవి:


శంభో శివ శంభో.. శివ శంభో శివ శంభో

వినరా ఓరన్నా ..అనెరా వేమన్న...

జగమే మాయన్నా... శివ శంభో...

నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. 

నేడే నీదన్న.. శివ శంభో..


వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..

జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..

నిన్న రాదన్న.. రేపూ లేదన్న ..

నేడే నీదన్న ...శివ శంభో..ఓ..


చరణం 1:


అందాన్ని కాదన్న.. ఆనందం లేదన్న..

బంధాలు వలదన్న... బ్రతుకంతా చేదన్న..

సిరులున్నా.. లేకున్నా.. చెలితోడు నీకున్నా..

అడవిలో నువ్వున్నా.. 

అది నీకు నగరంరా...ఆ..ఆ..ఆ


వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..

జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..ఓ..

నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. 

నేడే నీదన్న.. శివ శంభో..ఓ..ఓ..


చరణం 2:


ఈ తేటిదీ పువ్వు అని అన్నదెవరన్న..

ఏ తేనె తాగిన తీపొకటేకదరన్న..

నీదన్న నాదన్న.. వాదాలు వలదన్న..

ఏదైనా మనదన్న.. 

వేదాన్నే చదువన్న..ఓ..ఓ...

ఊరోళ్ళ సొమ్ముతో గుడికట్టి గోపన్న..ఆ..

శ్రీరామ భక్తుడై పేరొందెరోరన్న..

భక్తైనా రక్తైనా భగవంతుడేనన్న..

ఈనాడు సుఖమన్న.. ఎవడబ్బ సొమ్మన్న..


వినరా ఓరన్నా.. అనెరా వేమన్న..

జగమే మాయన్నా.. శివ శంభో..ఓ..ఓ..

నిన్న రాదన్న.. రేపూ లేదన్న.. 

నేడే నీదన్న.. శివ శంభో..ఓ..ఓ..


- పాటల ధనుస్సు 


సింగపూరు సింగారి | Singapooru Singari | Song Lyrics | Andamaina Anubhavam (1979)

సింగపూరు సింగారి



చిత్రం: అందమైన అనుభవం (1979)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు


పల్లవి:


సింగపూరు సింగారి 

వయసు పొంగు వయ్యారి

రాజమండ్రి కోడలుగ రానుందీ..

అహ సింగపూరు సింగారి 

వయసు పొంగు వయ్యారి

రాజమండ్రి కోడలుగ రానుందీ..

రాజమండ్రి కోడలుగ రానుంది 

అహహహ


మన్మధలీలమ్మ 

ఈ జన్మకు చాలమ్మా..

ఇది మన్మధలీలమ్మ 

ఈ జన్మకు చాలమ్మా..


సింగపూరు సింగారి 

వయసు పొంగు వయ్యారి

రాజమండ్రి కోడలుగ రానుందీ

రాజమండ్రి కోడలుగ రానుందీ 

ఎహేహేహే హహహ


చరణం 1:


దొరికింది గుర్రపు నాడం 

దొరుకుతుందనుకుంటి గుర్రం

ఊరంత గాలించినాను 

గాడిదై పోయాను నేను

నే నలసిపోయి సొలసిపోయి 

మరచిపోయి నిలిచిపోతే 

మెరుపల్లే వచ్చావు శంభో..

నా నిదురపోయి అదిరిపోయి 

మూగపోయి ఆగిపోతే 

గిలిగింత పెట్టావు శంభో..


ఇది మన్మధలీలమ్మ 

ఈ జన్మకు చాలమ్మా..

ఇది మన్మధలీలమ్మ 

ఈ జన్మకు చాలమ్మా..


సింగపూరు సింగారి 

వయసు పొంగు వయ్యారి

రాజమండ్రి కోడలుగ రానుందీ

రాజమండ్రి కోడలుగ రానుందీ... 

పపపప..


చరణం 2:


నీ కళ్ళు నా కళ్ళు కలిసి.. 

నీ కోర్కె నా కోర్కె తెలిసి

నీ సొగసు పువ్వల్లే విరిసి.. 

నా వయసు గువ్వల్లే ఎగసి

నేనదును చూసి తెగువ చేసి 

చెయ్యి వేసి చుట్టుకుంటె 

మంచల్లే కరిగావే శంభో

నీ సిగ్గు చూసి ఆకలేసి 

చెమట పోసి దాహమేసి 

అల్లాడిపోతున్న శంభో


ఇది మన్మధలీలమ్మ 

ఈ జన్మకు చాలమ్మా..

ఇది మన్మధలీలమ్మ 

ఈ జన్మకు చాలమ్మా..


సింగపూరు సింగారి 

వయసు పొంగు వయ్యారి

రాజమండ్రి కోడలుగ రానుందీ

రాజమండ్రి కోడలుగ రానుందీ.. 

పపపప...


- పాటల ధనుస్సు 


20, జూన్ 2024, గురువారం

హల్లో నేస్తం బాగున్నావా | Hello Nestam Bagunnava | Song Lyrics | Andamaina Anubhavam (1979)

హల్లో నేస్తం బాగున్నావా



చిత్రం: అందమైన అనుభవం (1979)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


హల్లో నేస్తం బాగున్నావా..

హల్లో నేస్తం గుర్తున్నానా..

హల్లో నేస్తం బాగున్నావా..

హల్లో నేస్తం గుర్తున్నానా..


నేనే నువ్వొయ్.. నువ్వే నేనోయ్..

నెనరు నెయ్యం మనమిద్దరమోయ్..

నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్

నెనరు నెయ్యం మనమిద్దరమోయ్

మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా

అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు

మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా

అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యౌ


హల్లో నేస్తం బాగున్నావా

హల్లో నేస్తం గుర్తున్నానా


చరణం 1:


ఊగే అలపై సాగే పడవ 

ఒడ్డు పొడ్డు చేర్చింది

ముచ్చటలన్ని మోసే గాలి 

దిక్కుదిక్కులను కలిపింది

కలకల పోయే చిలుకల 

గుంపు వరసా వావి నేర్పింది

నేల పీటగా నింగి పందిరిగా 

జగతికి పెళ్ళి జరిగింది..


సాయా అన్నా సింగపూరా..

సాయారుక మలేషియా..

సాయారేమో ఇండియా..

సాయావాడ చైనా..

హల్లో నేస్తం బాగున్నావా..

హల్లో నేస్తం గుర్తున్నానా...


చరణం 2 :


ఏ కళ్ళైనా కలిసాయంటే 

కలిగేదొకటే అనురాగం..

ఏ మనసైనా తెరిసాయంటే 

తెలిపేదొకటే ఆనందం..

సరిగమలైనా డొరనిపలైనా 

స్వరములు ఏడే గానంలో..

పడమటనైనా తూరుపునైనా 

స్పందన ఓకటే హృదయంలో..


సాయా అన్నా సింగపూరా..

సాయారుక మలేషియా..

సాయారేమో ఇండియా..

సాయావాడ చైనా..

హల్లో నేస్తం బాగున్నావా...

హల్లో నేస్తం గుర్తున్నానా..


చరణం 3 :


చైనా ఆట ..మలయా మాట.. 

హిందూ పాట.. ఒకటేను..

నీ నా అన్నది మానాలన్నది 

నేటి నినాదం కావాలోయ్...


సాయా అన్నా సింగపూరా..

సాయారుక మలేషియా...

సాయారేమో ఇండియా...

సాయావాడ చైనా...



హల్లో నేస్తం బాగున్నావా...

హల్లో నేస్తం గుర్తున్నానా..

నేనే నువ్వొయ్... నువ్వే నేనోయ్

నెనరు నెయ్యం మనమిద్దరమోయ్...

మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా..

అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు

మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా..

అరౌండ్ ది వరల్డ్ ఫ్రండ్ షిప్ వెల్కంస్ యు


- పాటల ధనుస్సు 


కాచుకొంటి కాచుకొంటి | What a waiting | Song Lyrics | Andamaina Anubhavam (1979)

కాచుకొంటి కాచుకొంటి



చిత్రం: అందమైన అనుభవం (1979)

సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు


పల్లవి : 


What a waiting

What a waiting

Lovely birds tell my darling

You were watching you were watching

Love is but a game of waiting 


చరణం 1 :


కాచుకొంటి కాచుకొంటి 

కళ్ళు కాయునంతదాక

చెప్పవమ్మ చెప్పవమ్మ 

చుప్పనాతి రామచిలక

మొక్కనాటి కాచుకున్న 

మొగ్గ తొడిగి పూచేనమ్మా

ఆమె రాదు ఆమె రాదు 

ప్రేమ లేదో అడగవమ్మ


What a waiting

What a waiting

Lovely birds tell my darling

You were watching you were watching

Love is but a game of waiting 


చరణం 2 :


కాచుకొంటి కాచుకొంటి 

కళ్ళు కాయునంతదాక

చెప్పవమ్మ చెప్పవమ్మ 

చుప్పనాతి రామచిలక

మొక్కనాటి కాచుకున్న 

మొగ్గ తొడిగి పూచేనమ్మా

ఆమె రాదు ఆమె రాదు 

ప్రేమ లేదో అడగవమ్మ


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నె పిల్లవని కన్నులున్నవని | Kannepillavani Kannulunnavani | Song Lyrics | Akali Rajyam (1980)

కన్నె పిల్లవని కన్నులున్నవని చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు, జానకి  పల్ల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు