RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

3, మే 2023, బుధవారం

వేదంలా ఘోషించే గోదావరి | Vedamla Ghoshinche | Song Lyrics | Andhra Kesari (1983)

వేదంలా ఘోషించే గోదావరి



చిత్రం: ఆంధ్రకేసరి (1983) 

సంగీతం: సత్యం

గీతరచయిత: ఆరుద్ర 

నేపధ్య గానం: బాలు 



పల్లవి: 


నమః సోమాయచ రుద్రాయ చ 

నమస్తామ్రాయ చారుణాయచ 

నమశ్శంగాయ చ పశుపతయే చ 

నమ ఉగ్రాయ చ భీమాయ చ 

నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ 

నమో హంత్రే చ హనీయసే 

చ నమో వృక్షేభ్యోహరి కేశేభ్యో 

నమస్తారాయ నమశ్శంభవే చ 

మయో భవే చ నమశ్శంకరాయ చ 

మయస్కరాయ చ 

నమశ్శివాయ చ శివతరాయ చ 


వేదంలా ఘోషించే గోదావరి 

అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 

వేదంలా ఘోషించే గోదావరి 

అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 

శతాబ్దాల చరిత గల సుందర నగరం 

శతాబ్దాల చరిత గల సుందర నగరం 

గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం 

వేదంలా ఘోషించే గోదావరి 

అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 


చరణం 1: 


రాజరాజ నరేంద్రుడు.. కాకతీయులు 

తేజమున్న మేటి దొరలు.. రెడ్డి రాజులు 

గజపతులు.. నరపతులు.. ఏలిన ఊరు 

ఆ కథలన్ని నినదించె గౌతమి హోరు 

వేదంలా ఘోషించే గోదావరి 

అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 

చరణం 2: 


శ్రీవాణి గిరిజాస్చిరాయ 

దథతో వక్షో ముఖాంగేశు 

యే లోకానాం స్థితిమావహంత్య 

విహితాం స్త్రీపుంస యోగోద్భవాం 

దేవేదత్రయమూర్తాయ స్త్రిపురుష 

సంపూజితాపస్సురైర్భూయాశుః 

పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాశ్రేయసే... 


ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా 

శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా 

ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా 

శ్రీనాధ కవి నివాసమూ పెద్ద ముచ్చటా 

కవిసార్వభౌములకిది ఆలవాలము 

కవిసార్వభౌములకిది ఆలవాలము 

నవ కవితలు వికసించె నందనవనము 


వేదంలా ఘోషించే గోదావరి 

అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి 


చరణం 3: 


దిట్టమైన శిల్పాల దేవళాలు 

కట్టుకథల చిత్రాంగి కనక మేడలు 

దిట్టమైన శిల్పాల దేవళాలు 

కట్టుకథల చిత్రాంగి కనక మేడలు 

కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు 

వీరేశలింగమొకడు మిగిలెను చాలు 


వేదంలా ఘోషించే గోదావరి 

అమరదామంలా శోభిల్ల్లే రాజమహేంద్రి 

శతాబ్దాల చరిత గల సుందర నగరం 

గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం 

వేదంలా ఘోషించే గోదావరి 

అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి 

వేదంలా ఘోషించే గోదావరి 

అమరదామంలా శోభిల్లే రాజమహేంద్రి 


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు