జాబిలి మెరిసెలే ఆశలు విరిసెలే
చిత్రం: తొలిరేయి గడిచింది (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరధి
గానం: పి.సుశీల, జేసుదాస్
జాబిలి మెరిసెలే ఆశలు విరిసెలే
తొలిరేయి గడిచినా
ఈరేయే తొలిరేయి మనకు ఈరేయే తొలిరేయి
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
కవ్వించు వెన్నెల రేయి ఆనాడు వెల వెలబోయె
ఊరించు వెన్నెల రేయి ఈనాడు కళ కళలాడె
నీలోని మిసమిసలన్నీ ఆరాట పరచెను నన్నే
హే వలపు గెలిచెలే నేటికి
జాబిలి మెరిసెలే
మెరిసెలే
ఆశలు విరిసెలే
విరిసెలే
తొలిరేయి గడిచినా ఈరేయే తొలిరేయి
మనకు ఈరేయే తొలిరేయి
నీలోని కొంటె తనాలూ
నీలోని మంచితనాలూ
జతజేరి విరబూయాలీ మన బాబులో చూడాలీ
గోపాల బాలుడుతానై మన ఇంట వర్ధిల్లాలీ
హే బ్రతుకు మధురమై సాగాలీ
జాబిలి మెరిసెలే
మెరిసెలే
ఆశలు విరిసెలే
విరిసెలే
తొలిరేయి గడిచినా ఈరేయే తొలిరేయి
మనకు ఈరేయే తొలిరేయి
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి