ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
చిత్రం: ఇల్లాలు ప్రియురాలు (1984)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు
పల్లవి:
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి.. ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా.. ఏమని.. ఏమని
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
చరణం 1:
నా బాధ ఇంక తీరేనా..
ఆ గాధ నీకు తెలిసేనా
నీ కంటి లేత కన్నీళ్ళు..
నా చేతులార తుడిచేనా
మమతే.. మరచి.. ఇక నాలోన నే దాగనా
మూగవీ ఆశలు.. గుడ్డివీ ప్రేమలు..
జాలిగా చూడకు...
అలా.. చూడకు.. చూడకు
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి.. ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా.. ఏమని.. ఏమని
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
చరణం 2:
అనుకోని ఘటన ఆనాడు..
అందించె నిన్ను ఈనాడు
మా దీపమై నీవు వస్తే..
ఈ కోవెలే తలుపుమూసే
బ్రతుకే.. అలిగే.. ఈ బంధాల కోభారమై
సాగనీ జాతకం.. ఆడనీ నాటకం ..
జాలిగా చూడకు ..
అలా.. చూడకు.. చూడకు
ఏమని తెలిపేది.. నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి.. ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా.. ఏమని.. ఏమని
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి