RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
korikale gurralaithe లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
korikale gurralaithe లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఏప్రిల్ 2026, ఆదివారం

మనసే మన ఆకాశం | Manase Mana Akasam | Song Lyrics | Korikale Gurralaithe (1979)

మనసే మన ఆకాశం


చిత్రం: కోరికలే గుర్రాలైతే (1979)

సంగీతం : సత్యం 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

గానం : ఎస్ పి బాలు, పి సుశీల ,


పల్లవి:


మనసే మన ఆకాశం

మనమే రవిచంద్రులం

ఇటు పగలు అటు రేయి

ఒకటై వెలిగే ప్రేమికులం


మనసే మన ఆకాశం

మనమే రవిచంద్రులం


చరణం 1:


ఒహొహో.....అహహా....

చందమామ నువ్వంట

వెన్నెల్లే నువ్వంట

నీ ముందు నేనుంటే 

దివిటీలా ఉంటా

సూరీడి వెచ్చనీ 

నీరెండ నువ్వంట

నీ మాట అనుకుంటే 

మాటలే రావంట

మాటలకందని 

మనిషివి నువ్వంట

మాటలకందని 

మనిషివి నువ్వంట

మనుషులకందని 

మమతే నీదంట


మనసే మన ఆకాశం

మనమే రవిచంద్రులం

ఇటు పగలు అటు రేయి

ఒకటై వెలిగే ప్రేమికులం

మనసే మన ఆకాశం

మనమే రవిచంద్రులం


చరణం 2:


నీకు నీవారుంటే 

నాకోసం నువ్వుంట

ఏ ఏటి ఒడ్డున 

ఇల్లేల మనకంట

నీ ఒంటి వానికి 

నీ జంట ఇల్లంట

ఆ ఇంట గోరంత 

దీపమై నేనుంటా

గోరంత దీపానికి 

ఇల్లంతా వెలుగంట

గోరంత దీపానికి 

ఇల్లంతా వెలుగంట

కొండంత దేవునికి 

కోవెలే నేనంట


మనసే మన ఆకాశం

మనమే రవిచంద్రులం


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు