ఇదే పాటా ప్రతీ చోటా
చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు
పల్లవి:
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను
చరణం 1:
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు
ఒక గానమై ఒకప్రాణమై జతగూడి మనమున్నాము
ఉన్నాము ఉన్నాము
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను
చరణం 2:
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
ఆ మూడుముళ్లని మరిచేవు నా పాల మనసుని విరిచేవు
ఈనాడు నను విడనాడినా ఏనాటికైనా కలిసేవు నువు
కలిసేవు నను కలిసేవూ
ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను
పాటల ధనుస్సు
అజరామరం అప్పటి సంగీత సాహిత్య గాత్ర గాన మాధుర్యాలు...👌💐🙏
రిప్లయితొలగించండి