14, ఏప్రిల్ 2025, సోమవారం

చినుకులలో వణికి వణికి | Chinukulalo vaniki vaniki | Song Lyrics | Rahashya Gudachari (1981)

చినుకులలో వణికి వణికి వణికి వణికి



చిత్రం  :  రహస్య గూఢాచారి (1981)

సంగీతం  :  సత్యం

గీతరచయిత : వేటూరి సుందరరామ మూర్తి 

నేపధ్య గానం  :  బాలు, సుశీల


పల్లవి :


చినుకులలో... వణికి వణికి వణికి వణికి

వణుకులలో... వలచి వలచి వలచి వలచి

వలపులలో..కలిసి కలిసి మెలిసి పిలిచి

కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ.. జడివానా

ఆ..హా..ఆ


చినుకులలో... వణికి వణికి వణికి వణికి

వణుకులలో... వలచి వలచి వలచి వలచి

వలపులలో... కురిసి కలిసి మెలిసి పిలిచి

కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ... జడివానా

ఆ..హా..ఆ


చరణం 1 :


మబ్బులు ముసిరే మనసులలో... 

మెరుపై మెరిసే సొగసులలో

వలపే తెలిపే పిలుపులలో... 

ఉరుమై ఉరిమే వయసులలో


కాముడి గుప్పిటిలోనా... 

కౌగిలి దుప్పటిలోనా

ఈ ముడి ఎప్పటికైనా... 

తప్పదు ఎవ్వరికైనా


కాముడి గుప్పిటిలోనా..ఆ

కౌగిలి దుప్పటిలోనా..ఆ

ఈ ముడి ఎప్పటికైనా..ఆ

తప్పదు ఎవ్వరికైనా..ఆ

చినుకు వణుకు చిచ్చులు రేపే .. 

వెచ్చటి ముచ్చటలోనా..ఆ


చినుకులలో... వణికి వణికి వణికి వణికి

వణుకులలో... వలచి వలచి వలచి వలచి

వలపులలో... కురిసి కలిసి మెలిసి పిలిచి

కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ... జడివానా

ఆ..హా..ఆ


చరణం 2 :


ఎదలో రగిలే ఎండలలో... 

మెదిలే వేసవి తపనలు

ఎదలే వెలిగే కన్నులలో... 

మెరిసే కాటుక కవితలలో


ఇద్దరి ముద్దులలోనా... 

తొలకరి వలపుల వానా

ఎందరు ఏమను కొన్నా..ఆ.. 

తప్పదులే..దేవుడికైనా


ఇద్దరి ముద్దులలోనా... 

తొలకరి వలపుల వానా

ఎందరు ఏమను కొన్నా..ఆ 

తప్పదులే..దేవుడికైనా

చిటుకు చిటుకు తాళాలేసే... 

చిత్తడి జల్లులలో


చినుకులలో... వణికి వణికి వణికి వణికి

వణుకులలో... వలచి వలచి వలచి వలచి

వలపులలో... కురిసి కలిసి మెలిసి పిలిచి

కురిసిందీ..ఈ..ఈ..ఈ..ఈ..ఈ... జడివానా

ఆ..హా..ఆ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి