14, ఏప్రిల్ 2025, సోమవారం

చెట్టెండిపోయాక పిట్టెగిరి పోయాక | Chettendipoyaka | Song Lyrics | Rahashya Gudachari (1981)

చెట్టెండిపోయాక పిట్టెగిరి పోయాక



చిత్రం  :  రహస్య గూఢాచారి (1981)

సంగీతం  :  సత్యం

గీతరచయిత : వేటూరి సుందరరామ మూర్తి 

నేపధ్య గానం  :  బాలు, సుశీల


పల్లవి :


చెట్టెండిపోయాక పిట్టెగిరిపోయాక.. 

చేసేది ఏముందిరా

అహా..హా.. హా..

చెట్టెండిపోయాక పిట్టెగిరిపోయాక.. 

చేసేది ఏముందిరా

కన్ను వేసి... కాపు చూసి... 

పాదు చేసి పండించుకోరా

హోయ్..హోయ్...హోయ్..


చెట్టిండిపోయుందా... 

పిట్టెగిరిపోతుందా.. 

చెయ్యేస్తే చిగురించదా

అహా..

చెట్టిండిపోయుందా... 

పిట్టెగిరిపోతుందా.. 

చెయ్యేస్తే చిగురించదా

కన్ను వేసి... కాపు చూసి... 

పాదు చేసి.. పండించుకోనా


చరణం 1 :


పూతా.. పులకరింతా.. 

పుచ్చుకుంటే వద్దంటా

రెమ్మ పడుచుకొమ్మా... 

పచ్చగుంటే కాదంటానా

పూతా.. పులకరింతా.. 

పుచ్చుకుంటే వద్దంటా

రెమ్మ పడుచుకొమ్మా... 

పచ్చగుంటే కాదంటానా


రెపరెపమను చిగురాకుల 

తపనలు విన్నావా

గుబగుబమను గుండెల్లో 

గుబులును కన్నావా

కొండయ్యో..హోయ్... 

గుండయ్యో.. హోయ్

కొమ్మెండిపోతాదయ్యో... హోయ్


చెట్టిండిపోయుందా... 

పిట్టెగిరి పోతుందా.. 

చెయ్యేస్తే చిగురించదా

అహా.. 

చెట్టెండిపోయాక పిట్టెగిరిపోయాక.. 

చేసేది ఏముందిరా


చరణం 2 :


గూడు.. గువ్వ తోడు... 

వెచ్చగుంటే... వద్దంటానా

ఈడు.. తగిన జోడు... 

మెచ్చుకుంటే కాదంటానా


గూడు.. గువ్వ తోడు... 

వెచ్చగుంటే... వద్దంటానా

ఈడు.. తగిన జోడు... 

మెచ్చుకుంటే కాదంటానా

పెరపెరమను నా పెదవుల 

మనసును చూస్తావా

విరవిరమను విరజాజుల 

మనసును కన్నావా

కొండమ్మో..హహా.. గుండమ్మో.. 

హొయ్ హొయ్

నా కొంపా ముంచావమ్మో... హోయ్


చెట్టెండిపోయాక పిట్టెగిరిపోయాక.. 

చేసేది ఏముందిరా

కన్ను వేసి... కాపు చూసి... 

పాదు చేసి.. పండించుకోనా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి