14, ఏప్రిల్ 2025, సోమవారం

నిరంతరం తరం తరం | Nirantaram Taram taram | Song Lyrics | Rahashya Gudachari (1981)

నిరంతరం తరం తరం



చిత్రం  :  రహస్య గూఢాచారి (1981)

సంగీతం  :  సత్యం

గీతరచయిత : వేటూరి సుందరరామ మూర్తి 

నేపధ్య గానం  :  బాలు, సుశీల


పల్లవి :


నిరంతరం.. తరం తరం... 

అనుక్షణం నిరీక్షణం

నీ కోసం.. హు ఊ.. నీ కోసం


నిరంతరం.. తరం తరం... 

అనుక్షణం నిరీక్షణం

నీ కోసం.. హు ఊ.. నీ కోసం 


చరణం 1 :


గంగా యమునా పొంగెను మనలో... 

జరగనీ సంగమం.. సంగమం

మన సంఘమమే మధురోదయమై 

పొంగనీ యువతరం... యువతరం

ఎవ్వరు పాడని అనురాగాలే...  

ఎదలలో సాగే వరదలై


నిరంతరం.. తరం తరం... 

అనుక్షణం నిరీక్షణం

నీ కోసం.. హు ఊ.. నీ కోసం 


చరణం 2 :


మన చూపులలో శుభ సందేశం 

పలకనీ ప్రతిక్షణం... అనుక్షణం

మన గుండెలలో ప్రేమావేశం 

రగలనీ అనుక్షణం... ప్రతిక్షణం

దేశంలో మన సందేశం 

ప్రతీ నోట పాటై వినిపించే


నిరంతరం.. తరం తరం... 

అనుక్షణం నిరీక్షణం

నీ కోసం.. హు ఊ.. నీ కోసం 


నీ కోసం.. హు ఊ.. నీ కోసం

నీ కోసం.. హు ఊ.. నీ కోసం 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి