9, సెప్టెంబర్ 2023, శనివారం

చిత్రం ఆయ్ భళారే విచిత్రం | Chitram bhalare vichitram | Song Lyrics | Dana Veera Sura Karna (1977)

చిత్రం ఆయ్ భళారే విచిత్రం



రచన : C నారాయణ రెడ్డి,

సంగీతం  : పెండ్యాల నాగేశ్వరరావు,

గానం  : SP బాలు , P సుశీల ,

చిత్రం  : దాన వీర శూర కర్ణ (1977),


పల్లవి:

చిత్రం ఆయ్ భళారే విచిత్రం

చిత్రం అయ్యారే విచిత్రం

ఈ రాచనగరుకు రారాజును 

రప్పించుట విచిత్రం

పిలువకనే ప్రియ విభునే 

విచ్చేయుటే విచిత్రం


చరణం 1:

రాచరికపు జిత్తులతో 

రణతంత్రపు టెత్తులతో

సదమదము మామదిలో 

మదనుడు సందడి సేయుట

చిత్రం ఆయ్ భళారే విచిత్రం


ఎంతటి మహరాజైన ఆ ఆ ఆ

ఎంతటి మహరాజైన ఎపుడో ఏకాంతంలో

ఎంతో కొంత తన కాంతను 

స్మరించుటే సృష్టిలోని

చిత్రం ఆయ్ భళారే విచిత్రం


చరణం 2:

బింబాధర మధురిమలు

బిగి కౌగిలి ఘుమఘుమఘుమలు

ఆ ఆ ఆ ఆ బింబాధర

ఇన్నాళ్ళుగ మాయురే 

మేమెరుగక పోవుటే

చిత్రం ఆయ్ భళారే విచిత్రం


ఆఆఆ వలపెరుగని వాడననీ

వలపెరుగని వాడనని 

పలికిన ఈ రసికమణీ

తొలిసారే ఇన్ని కళలు కురిపించుట

అవ్వ నమ్మలేని చిత్రం 

అయ్యారే విచిత్రం

ఆయ్ భళారే విచిత్రం 

అయ్యారే విచిత్రం


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి