7, సెప్టెంబర్ 2023, గురువారం

చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే | Chinnari Naa rani | Song Lyrics | Ramuni Minchina Ramudu (1975)

చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే



రచన : C నారాయణ రెడ్డి,

సంగీతం : T చలపతి  రావు,

గానం : SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల,

చిత్రం : రాముని మించిన రాముడు (1975),


పల్లవి:

చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే

గాలి ఈల వేసింది పూల వాన కురిసింది

గాలి ఈల వేసింది పూల వాన కురిసింది

లోకమే పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే


అందాల నా రాజు అనురాగమే చిందితే

గాలి ఈల వేసింది పూల వాన కురిసింది

లోకమే పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే



చరణం 1:

నా నోము పండింది నేడు 

నాకు ఈ నాడు తొరికింది తోడు


నా రాణి అధరాల పిలుపు 

నాకు తెలిపేను తనలోని వలపు. 

నిండు వలపు


అందాల నా రాజు అనురాగమే చిందితే

గాలి ఈల వేసింది పూల వాన కురిసింది

లోకమే పులకించి 

మైకంలో ఉయ్యాలే ఊగెలే


చరణం 2:

ఎన్నెన్ని జన్మాల వరమో 

నేడు నా వాడవైనావు నీవు


నా వెంట నీవున్న వేళ 

కోటి స్వర్గాల వైభోగమేలా భోగమేల


చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే

గాలి ఈల వేసింది పూల వాన కురిసింది


లోకమే పులకించి 

మైకంలో ఉయ్యాలే ఊగెలే


చరణం 3:

ఈ తోట మన పెళ్ళి పీఠ 

పలికే మంత్రాలు గోరింక నోట


నెమలి పురివిప్పి ఆడింది 

ఆట వినగ విందాయే 

చిలకమ్మ పాట పెళ్ళి పాట


అందాల నా రాజు అనురాగమే చిందితే

గాలి ఈల వేసింది పూల వాన కురిసింది


లోకమే పులకించి 

మైకంలో ఉయ్యాలే ఊగెలే


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి